అందరి ముందే ఆ హీరోకు ముద్దిచ్చిన యాంకర్ శ్రీముఖి…

ఈమధ్య వెండితెర సెలబ్రెటీలే కాకుండా బుల్లి తెర సెలబ్రెటీలు కూడా రెచ్చిపోతున్నారు. బుల్లితెరపై రొమాన్స్ సీన్లు పండిస్తున్నారు.. బుల్లితెరకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ.. అందుకే కాస్త పద్ధతిగా కనిపించేవారు.. కానీ బుల్లితెరపై పరిస్థితి మారింది.. కంటెస్టెంట్లు హద్దులు దాటేస్తున్నారు. షోలలో ముద్దులతో రెచ్చిపోతున్నారు.. సాధారణంగా ఏదైనా పండుగ వస్తే.. ఆరోజుకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను టీవీ షోలో ప్రసారం చేస్తుంటారు.. ఈక్రమంలో ఈటీవీ వారు రాకీ పౌర్ణమి సందర్భంగా ‘హలో బ్రదర్’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ నటులు సందడి చేశారు. రాఖీలు కట్టుకుని సెలబ్రేట్ చేసుకున్నారు.. ఈ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

ఈ షోకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించింది. నవీన్ చంద్ర ముఖ్య అతిథగా హాజరయ్యారు. తాజాగా విడుదలైన ప్రోమోలో హైపర్ ఆది, రాంప్రసాద్ లతో కలిసి శ్రీముఖి రచ్చ చేసింది.. ఈ సందర్భంగా ఆది, రాం ప్రసాద్ లకు శ్రీముఖి ఓ టాస్క్ ఇచ్చింది. ఈ టాస్క్ లో భాగంగా వీరిద్దరూ శ్రీముఖిని ముద్దులతో ముంచెత్తారు. శ్రీముఖి కూడా ఇద్దరిని ముద్దులు పెట్టేసింది.. ‘ఆకలేస్తే అన్నం పెడతా’ సాంగ్ ప్లే చేసి.. పాటలో ఉన్న వస్తువులను తెచ్చి ఇవ్వాలని, ఎవరు ముందుగా వస్తే వారు గెలిచినట్లు చెప్పారు.

ఈ పాటలో ‘ఆకలేస్తే అన్నం పెడతా’ అని ప్లే అవ్వగానే ఆది అన్నం, ఆయిల్ కోసం పరుగులు పెట్టాడు. అయితే రామ్ ప్రసాద్ మాత్రం శ్రీముఖికి ముద్దులు పెడుతూ ఉన్నాడు.. ‘మూడొస్తే ముద్దులు పెడతా’ అని ప్లే అవగానే ఇద్దరు కలిసి శ్రీముఖి చేతికి ముద్దులు పెడతారు..దీంతో అక్కడున్న వారందరూ షాక్ అవుతారు..అయితే వారిద్దరు శ్రీముఖికి ఎందుకు ముద్దులు పెట్టారో వివరిస్తారు.. ఆ తర్వాత నవీన్ చంద్ర స్టేజ్ మీదకు వస్తాడు..అప్పుడు నవీన్ బుగ్గపై శ్రీముఖి ముద్దు పెట్టింది. దీంతో హైపర్ ఆది, రాం ప్రసాద్ తో పాటు అక్కడున్న వారందరూ నోరెళ్లబెడతారు..

Share post:

Latest