అంత సులభం కాదంటూ..మాతృత్వం పై షాకింగ్ కామెంట్స్ చేసిన సోనమ్ కపూర్..!

 పలుకుబడి ఉన్న సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నా సరే మాతృత్వం కోసం పాత లాడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా మాతృత్వం పొందడం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పాలి. ఇక ఈ మాతృత్వం పొందడంలో ఎన్ని కష్టాలు పడడానికైనా సరే ఆడవారు ముందుంటారు. ప్రెగ్నెన్సీ మొదలైన రోజు నుంచి బిడ్డ బయటకు వచ్చే సమయం వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది . ఇక ఈ క్రమంలోని సోనం కపూర్ కూడా మాతృత్వం పై కొన్ని షాకింగ్ కామెంట్ చేసింది.Preggers Sonam Kapoor shares 'swollen feet' picture, says 'pregnancy not  pretty sometimes'! | People News | Zee Newsప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ నట వారసురాలిగా సోనం కపూర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించడమే కాకుండా విభిన్నమైన పాత్రలలో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం అమ్మ కాబోతున్న విషయం తెలిసిందే 2018 లో ఆనంద్ అహుజా ను పెళ్లి చేసుకున్న సోనం కపూర్ చాలా సంవత్సరాల తర్వాత మాతృత్వ అనుభూతి పొందుతోంది. ప్రస్తుతం ఈమెకు వరుస ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో ఇలా తల్లి కాబోతూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా సోనం కపూర్ తల్లి కాబోతున్న నేపథ్యంలో వరుసగా ఫోటోషూట్ చేస్తూ తన బేబీ బంప్ ను చూపిస్తూ వస్తుంది. అంతేకాదు గర్భవతి అయినప్పటి నుంచి ప్రతి మూమెంట్ను కూడా షేర్ చేస్తూ తన ఇష్టాలను కష్టాలను కూడా షేర్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.Sonam Kapoor's condition deteriorated just a few days before the delivery  date, such a picture surfaced lying on the bed - informalnewz

- Advertisement -

ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్న ఈ సమయంలో .. అంతా నార్మల్ గా ఉండదు అని.. గర్భం దాల్చినప్పుడు ప్రతిక్షణం ఆనందమే కాదు కష్టం కూడా ఉంటుంది అంటూ.. తన వాచిపోయిన కాళ్ళ ఫోటోలను షేర్ చేసింది . ఎక్కువ సమయం కూర్చొని ఉండడం .. విశ్రాంతి తీసుకొని ఉండటం వల్ల కాళ్లు ఇలా వాచాయి అంటూ ఆమె తెలిపింది. ఇకపోతే గర్భం దాల్చిన తర్వాత ప్రతి ఒక్క స్త్రీలో ఇలాంటి లక్షణాలు సహజంగా కనిపించినా.. ఈమె మాత్రం సెలబ్రిటీ కావడం వల్ల ప్రతి ఒక్కరు ఈమెపై జాలి తలుస్తున్నారు.ఇకపోతే ఆమె పాపకు జన్మనిస్తుందా లేక బాబుకు జన్మనిస్తుందా అనే విషయంపై సోనం కపూర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Share post:

Popular