షాక్: షూటింగ్లో గాయపడిన హీరోయిన్ శిల్పా శెట్టి..!!

సినిమా షూటింగ్లో పాల్గొనడం కొన్నిసార్లు ప్రమాదం జరగడం ఇలా ఎంతోమంది నటీనటులకు జరిగే ఉంది. ముఖ్యంగా హడావిడి చేసే సన్నివేశాలలో చాలా జాగ్రత్త వహించాలి. లేదంటే కొన్నిసార్లు తీవ్రంగా గాయాలు అవుతూ ఉంటాయి. అందుకే సినీ తారలు రక్షణ విషయంలో నిర్మాతలు, దర్శకులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ కు సంబంధించిన పలు విషయాలలో ఏమాత్రం జాగ్రత్తగా ఉండకపోయినా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఇద్దరు హీరోయిన్లకు ఒకేసారి వారు సినిమా షూటింగ్లో గాయాలు అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. వాటి గురించి చూద్దాం.Bollywood actress Shilpa Shetty – B-E-St By JeeCee DEఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా పేరు సంపాదించింది హీరోయిన్ శిల్పా శెట్టి. ప్రస్తుతం బాలీవుడ్లో తన వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తూ ఉన్నది. ఇక ఇటీవల ఈమె సినిమా షూటింగ్లో పరిగెత్తుతున్న సన్నివేశంలో నటిస్తూ ఉండగా కాలు జారి కింద పడిపోయింది..ఆ సమయంలో ఆమె మోకాలికి తీవ్రంగా గాయం కావడంతో వెంటనే షూటింగ్ దగ్గరికి వైద్యుని పిలిపించి చికిత్స చేయించారు. కానీ ఆమె నడవలేని పరిస్థితుల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆమె పర్సనల్ క్యార్ వ్యాన్ లో వైద్యులు ఆమె కాలికి పట్టి ఉంచినట్లుగా సమాచారం.Shilpa Shetty's leg fractured during the shoot - Estrade Heraldఇక మరొకవైపు మరొక సినిమా సెట్లో హీరోయిన్ టబు కూడా గాయాల పాలయ్యింది. హిందీ ఖైదీ సినిమా రీమిక్స్ లో అజయ్ దేవగన్ నటిస్తూ ఉండగా ఇందులో ముఖ్యమైన పాత్రలో ఈ ముద్దుగుమ్మ నటిస్తున్నది. ఇక ఈమె కూడా ఒక గొడవ పడే సన్నివేశంలో నటిస్తూ ఉన్న సమయంలో కింద పడడం జరిగిందట. ఇక దీంతో ఆమెకు పెద్దగా గాయాలు అయితే తగలలేదు కానీ షూటింగ్ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం. మొత్తంగా వీరి ఇద్దరికీ గాయాలు అవడానికి కారణం మాత్రం సినిమా షూటింగ్ కారణమని చెప్పవచ్చు. దీంతో కొన్ని రోజులపాటు సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం.

Share post:

Latest