ఆ మెగా హీరోపై మ‌ళ్లీ పుకార్లు… అస‌లేం జ‌రుగుతోంది…!!

గత కొన్ని రోజుల నుంచి మెగా హీరో వరుణ్ తేజ్ విషయంలో వస్తున్న వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇకపోతే గత కొద్ది రోజుల నుంచి ఇలాంటి వార్తలు రాలేదు అని అనుకునే లోపే.. మళ్ళీ ఇలాంటి పుకార్లకు చోటు ఇచ్చారు. మెగా హీరో వరుణ్ తేజ్.. నిజానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ,ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ప్రేమాయణం నడుపుతున్నాడని వార్తలు రోజు రోజుకు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే గతంలో వీరిద్దరూ మిస్టర్, అంతరిక్షం సినిమాలలో నటించారు. ఇక అప్పటినుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు కూడా వైరల్ అయ్యాయి.Mega hero Varun Tej going to marry Lavanya?!

అంతేకాదు మొన్నామధ్య బెంగళూరులో ఉంటున్న లావణ్య త్రిపాఠి దగ్గరకు వరుణ్ తేజ్ తన పుట్టినరోజు సందర్భంగా ఆమెను వెళ్లి కలుసుకున్నాడు అని, అంతేకదా ఎంగేజ్మెంట్ రింగ్ కూడా ఆమెకు తొడగబోతున్నాడు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి కానీ ఈ విషయంపై స్పందించిన లావణ్య త్రిపాఠి అందులో ఎలాంటి నిజం లేదు అని, ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని, ఆ సమయంలో తాను తన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని కూడా చెప్పుకొచ్చింది. కానీ లావణ్య త్రిపాటి ఎన్ని చెప్పినా సరే ఎవరు వినడం లేదని చెప్పాలి. ఎందుకంటే ఆమె నిహారిక పెళ్లిలో అన్ని తానే అయి దగ్గరుండి చూసుకుంది. అంతేకాదు మెగా ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే అందుకు అతిథిగా లావణ్య త్రిపాఠి హాజరవుతూ ఉంటుంది.Varun Tej Lavanya Tripathi At Friend Birthday Party Photos Goes Viralఇప్పుడు మరొకసారి ఈ వార్తలకు ఆజ్యం పోసింది ఈ జంట. ఇకపోతే తాజాగా వరుణ్ తేజ్ వెళ్లిన బర్త్ డే పార్టీకి హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు వీరిద్దరూ ఒకే పార్టీలో మరొకసారి కనిపించడం.. ఆ పార్టీకి మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఉండడం విశేషం. కామన్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వీరిద్దరూ హాజరయ్యారు హైదరాబాదులో జరిగిన ఈ వేడుకల్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తో పాటు సాయి ధరంతేజ్ ,నితిన్ ఆయన భార్య షాలిని కూడా పాల్గొన్నారు. ఇకపోతే ప్రస్తుతం వీరిద్దరూ ఒకే కారులో కూడా కనిపించేసరికి ఇలాంటి పుకార్లు బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

Share post:

Latest