రోజా కూతురు హీరోయిన్ అవుతోందోచ్‌… ఆ స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్‌…!

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది సెలబ్రిటీల వారసులు తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిలో ప్రతిభ ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతారు.. లేకపోతే ఒకటి రెండు సినిమాలకే ఇండస్ట్రీ నుంచి దూరం అవ్వాల్సిందే.. ఇక ఈ నేపథ్యంలోనే మరో వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. ఇక ఆ వారసురాలు ఎవరో కాదు అందాల నటి సీనియర్ స్టార్ హీరోయిన్ అలాగే మంత్రి ఆర్కే రోజా కూతురు అన్షు మాలిక. రోజా కూతురుగా ఈమె పాపులారిటీని సొంతం చేసుకోక ముందే నవలలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. అంతే కాదు జాతీయస్థాయిలో అవార్డుని సైతం సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అన్షు మాలిక త్వరలో సినిరంగ ప్రవేశం చేయబోతోంది అంటూ కొద్ది రోజుల నుంచి వార్తలు పుకార్లుగా వినిపిస్తున్నాయి. ఇక ఇందులో వాస్తవాలు తెలియక ముందే సోషల్ మీడియాలో ఈ రూమర్లు స్ప్రెడ్ అవ్వడం గమనార్హం. ఇక మొన్నటి వరకు ఈ వార్తలు బాగా వైరల్ అయినప్పటికీ కొద్ది రోజులపాటు సద్దుమనిగాయని చెప్పవచ్చు. కానీ తాజాగా మరొకసారి ఈ వార్త తెరపైకి రావడంతో నిజంగానే అన్షు మాలిక సినీ ఎంట్రీ ఇస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ రోజా నటవారసత్వాన్ని కొనసాగిస్తూ ఆమె వారసురాలు అన్షు మాలిక త్వరలోనే సినిమాల్లోకి రానుందట. అంతేకాదు ఒక స్టార్ హీరో వారసుడి సినిమా ద్వారా ఈమె హీరోయిన్గా అరంగేట్రం చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే అమెరికాలో ఫేమస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో అన్షుకి సీటు కూడా వచ్చింది . త్వరలోనే అక్కడ చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే నటనలో శిక్షణ పూర్తి అయిన వెంటనే అన్షు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇకపోతే తల్లిలాగే తాను కూడా మంచి ఇమేజ్ ను …..సొంతం చేసుకోవాలని పలువురు అభిమానులు కోరుకుంటున్నారు.