అక్షతకు సమయస్ఫూర్తి ఎక్కువే..కానీ,..దాంపత్య బంధం గురించి రిషి సునాక్‌ సంచలన కామెంట్స్..!!

భార్య భర్తల బంధం చాలా విలువైనది..చాలా సున్నితమైనది అంటుంటారు మన పెద్ద వాళ్ళు. అది నిజమే అని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. భార్యకి భర్త గురించి..భర్తకి భార్య గురించి అన్ని తెలిసినా..బయటకు చెప్పుకోలేరు కొందరు. పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తులు అయితే..అస్సలు అలాంటి విషయాలు అస్సలు బయటపెట్టారు. చాలా గోప్యంగా ఉంచుతారు. కానీ, బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవి కోసం హోరాహోరీగా తలపడుతున్న రిషి సునాక్‌ మాత్రం.. తన సతీమణి అక్షతా మూర్తి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

తనతో అనుబంధం గురించి..వాళ్ళ దాంపత్య జీవితం గురించి..రీసెంట్ ఇంటర్వ్యుల్లో పలు ఆసక్తికర విషయాలు జనాలతో పంచుకున్నారు. దీంతో ఆయన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. తన భార్యతో పోలిస్తే..తనకే ఎక్కువక్రమశిక్షణ ఉందని చెప్పిన ఆయన..తన భార్యకు చాలా సమయస్ఫూర్తి ఉందని చెప్పుకొచ్చారు. ఇంత పెద్ద స్ధాయి లో ఉండే ఆయన తన భార్య పై ఇలా సరదాగా చేసి న కామెంట్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి.

Narayan Murthy's daughter richer than the Queen, husband under fire for not  disclosing her wealth: Report - World News

ఆయన మాట్లాడుతూ ..”నిజానికి మేమిద్దరం చాలా భిన్నమైన నేచర్స్ కలిగిన వాళ్లం. బహుశా విజాతి ధ్రువాలే ఆకర్షించుకుంటాయన్న మనం చిన్నప్పుడు చదివాము గా..అదే నిజం అని ఇలాంటివి చూసిన్నప్పుడే అనిపిస్తుంది. అక్షత ను అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఫస్ట్ కలుసుకొన్నను . మొదటిసారి ఆమెను చూసినప్పుడే ఏదో తెలియని ఫీలింగ్. మా పెళ్లి 2006లో బెంగళూరులో జరిగింది. నాకు క్రమశిక్షణ ఎక్కువ.. నేను వస్తువులన్నింటినీ చక్కగా సర్దుకుంటాను. కానీ, ఆవిడ అలా కాదు. చిందరవందరగా పడేస్తుంటుంది. కానీ చాలా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తుంటుంది. నిజానికి ఇలాంటి విషయాలు బయటకు చెప్పడం తనకు నచ్చదు. కానీ నేను మీకు అన్ని చెప్పేస్తున్నా..”అంటూ అక్కడున్న వారిని నవ్వించేశాడు. అక్షత ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అనే సంగతి తెలిసిందే.

Share post:

Latest