స్టార్ హోదా పై సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మిక..!!

రష్మిక మందన్న.. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఛలో సినిమా ద్వారా అడుగుపెట్టిన ఈ కన్నడ ముద్దుగుమ్మ వరుస అవకాశాలను అందుకొంటూ స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఛలో సినిమా పెద్దగా విజయాన్ని సాధించకపోయినా.. ఈమెకు మాత్రం మంచి గుర్తింపు లభించింది.. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఏకంగా మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే అవకాశం రావడంతో అందరి దృష్టి ఈమె పైనే పడిందని చెప్పవచ్చు.Rashmika Mandanna's Srivalli act in Pushpa got her 'Animal' with Ranbir  Kapoor | People News | Zee News

ఇక ఆ తర్వాత పుష్ప సినిమాలో డీ గ్లామరస్ పాత్ర పోషించి పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు పుష్ప సీక్వెల్ లో కూడా నటిస్తూ ఇండియా అంతట మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న రష్మిక బాలీవుడ్ లో ఏకంగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. ఇక నేషనల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ప్రజలతో మమేకం కావడానికి పలు యాడ్స్ లో నటిస్తూనే మరొక పక్క జొమాటో ఫుడ్ డెలివరీ కూడా చేసి కస్టమర్లను సర్ప్రైజ్ కూడా చేసింది. అంతేకాదు ఈమె ధరించే దుస్తులు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి.Pushpa' star Rashmika Mandanna says she is 'too young for marriage', talks  about her ideal partner | People News | Zee Newsఇకపోతే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రష్మిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని స్టార్ హోదా దక్కించుకోవడానికి ఎంత కష్టం ఉంటుందో ఆ విషయాన్ని వెల్లడించింది. రష్మిక మీడియాతో మాట్లాడుతూ స్టార్ హోదా అనేది ఒక్క రాత్రి రాలేదు.. ఏడు సంవత్సరాల పాటు నిర్విరామంగా కష్టపడ్డాను.. ఎన్నో రాత్రులు ఒంటరిగా నిద్రలేని రాత్రులను గడిపాను.. అలా కష్టపడడం వల్లే ఈరోజు స్టార్ ఇమేజ్ వచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కేవలం స్టార్ అనే పదాన్ని దక్కించుకోవాలి అంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక స్టార్ హీరోయిన్లు, హీరోలు ఏ రేంజ్ లో కష్టపడి ఉంటే తప్ప వారు ఈ స్థాయికి వచ్చి ఉంటారు అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest