కుర్రకారుని హీట్ ఎక్కిస్తోన్న ప్ర‌ణీత సుభాష్‌.. లేటెస్ట్ ఫోటో షూట్ అదరహో!

ప్ర‌ణీత అంటే ఎవరో తెలియని తెలుగు యువత ఉండరనే చెప్పుకోవాలి. చేసినవి అరకొర సినిమాలైనా.. తన అందచందాలతో తెలుగునాట మంచి గుర్తింపే సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ ప్ర‌ణీత‌. వివాహం తరువాత అమ్మగా ప్రమోషన్ కొట్టేసిన ప్రణీత గ్లామర్ షోలో మాత్రం జోరు తగ్గించడం లేదు. 2021 అక్టోబర్ లో సైలెంట్ గా వివాహం చేసుకున్న ప్రణీత సినిమాలు తగ్గించారు. వ్యాపారవేత్త నితిన్ రాజ్ ని పెళ్లాడిన ప్రణీత ఈ ఏడాది ఓ అందమైన అమ్మాయికి జన్మనిచ్చారు. పెళ్ళైన ఏడాది లోపే ప్రణీత తల్లిగా ప్రమోట్ కావడం విశేషం.

ఇటీవ‌ల జగతిని ఉద్ధరిస్తామని బయల్దేరిన కొందరు ఫెమినిస్టులు ఆమెను ట్రోల్ చేయడం వైరల్ గా మారింది. విషయం ఏమంటే… భర్త క్షేమం కోసం ఆమె పూజలు చేసిన సంగతి విదితమే. దాంతో తప్పేముందని ప్రణీత తనని తానూ సమర్ధించుకున్నారు. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీలో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటించారు. ఆ మూవీ భారీ హిట్ కావడంతో NTRతో రభస చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. తెలుగులో ప్రణీత కనిపించిన చివరి చిత్రం NTR కథానాయకుడు అని చెప్పుకోవాలి.

ఇక అసలు విషయానికొస్తే… సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్ధమైన ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ తాజాగా ఫోటో షూట్స్ చేస్తూ కుర్రకారుకి కిర్రెక్కించారు. తన అంద చందాలతో దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవును…. ప్రణీత ఎప్ప‌టిక‌ప్పుడు తన క్యూట్ అందాలు ఆర‌బోస్తూ మ‌తులు పోగొడుతుంది. ఈ అమ్మ‌డి కేక పెట్టించే అందాల‌కు సోషల్ మీడియాలో నెటిజన్ల మ‌తులు పోతున్నాయి. ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిన ప్రణీత హిందీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకోవడం విశేషం. 2021లో విడుదలైన భుజ్, హంగామ 2 చిత్రాల్లో ప్రణీత నటించారు. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా కన్నడ మూవీ రావణ అవతార చేస్తున్నారు.

Share post:

Latest