తెలుగులో మాత్రమే ఏకంగా అన్నిసార్లు బ్యాన్ చేయబడ్డ ప్రకాష్ రాజ్.. కారణం..?

ప్రకాష్ రాజ్.. ఏ పాత్ర ఇచ్చినా సరే లీనం అయిపోయి నటించగలిగే ఒకే ఒక్క విలక్షణ నటుడు అని చెప్పవచ్చు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, రాజకీయవేత్తగా , బిజినెస్ మాన్ గా ఇలా ఏ పాత్ర ఇచ్చినా సరే ఆ పాత్రలో పూర్తిస్థాయిలో లీనమైపోయి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రకాష్ రాజ్ కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందినవారు. నిజానికి ఈయన చదువుకునే రోజుల్లో ఎన్నో డ్రామాలలో నటించి ఆ తర్వాత తమిళ్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవ్వడం జరిగింది. ఇక అలా తెలుగు, తమిళ్ ,మలయాళం అంటూ అన్ని భాషలలో కూడా తన నటనతో ఆకట్టుకున్న ప్రకాష్ రాజ్ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అభిమానులుగా మార్చుకున్నాడు. ఈయన గొప్ప నటుడు మాత్రమే కాదు గొప్ప మానవతావాది కూడా.. ఏకంగా కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని తన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఆ గ్రామాల అభివృద్ధి కోసం తన వంతు సహాయంగా అందజేస్తున్నారు.Prakash Raj - Wikipediaఇకపోతే వివాదాలకు ఎప్పుడూ దగ్గరగా ఉండే ప్రకాష్ రాజ్ తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఏకంగా ఏడుసార్లు బ్యాన్ చేయబడ్డాడు. ఇక ఇదే విషయంపై ప్రకాష్ రాజ్ ను అడిగితే ఆయన మాట్లాడుతూ.. ఒక మనిషి తన కెరియర్ లో ముందుకు వెళ్తున్నాడు అంటే ఎవరైనా సరే వారిని కించపరచాలని చూస్తారు. తప్పు ఒకరిదే ఎప్పుడు ఉండదు.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కొట్టగలం అంటూ తెలిపారు. కథ చెప్పినప్పుడు ఒకేలాగా షూటింగ్ సినిమా అప్పుడు ఒకలాగా ఉన్నప్పుడు లేదా ఇతర కారణాల వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. ఇక కొన్ని సందర్భాలలో మాటమీద నిలబడటం వల్ల నాపై ఆరోపణలు వచ్చాయి. అప్పుడే అర్థమైంది అన్ని సందర్భాలలో కూడా నిజాయితీగా ఉండకూడదు అని ఇక ముక్కుసూటితనం వల్లే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని తెలిపాడు.All winners from Prakash Raj panel resigns, no split in MAA- Cinema express

ఇక తెలుగులో మాత్రమే 7 సార్లు బ్యాన్ చేసినా.. కూర్చొని మాట్లాడి సమస్యను సాల్వ్ చేసుకున్నామని తెలిపారు . ఇక పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని ఒక మంచి వ్యక్తి పాలిటిక్స్ లోకి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.

Share post:

Latest