అభిమాని బర్తడే సందర్భంగా.. అభిమానికే సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య..!!

నందమూరి బాలకృష్ణ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సినిమాల పరంగా కానీ వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా అభిమానులు సంపాదించుకున్నారు. ఇక చివరకు ఆయనకు చిరాకు వచ్చే విధంగా అభిమానులు పనిచేస్తూ ఉంటారు. ఇక అంతే స్థాయిలో ప్రేమను కూడా కురిపిస్తూ ఉంటారు బాలకృష్ణ. అయితే బాలకృష్ణ గురించి పూర్తిస్థాయిలో తెలిసినవారు ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని తెలియజేస్తూ ఉంటారు. అందుచేతనే ఆయన కోప్పడినా కూడా అభిమానుల సైతం దానిని ఇష్టంగానే భావిస్తూ ఉంటారు. ఇక బాలకృష్ణ అభిమానులకు ప్రేమ పంచే విషయంలో కూడా వారిని సర్ప్రైజ్ చేయడంలో బాలయ్య ఒక అడుగు ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు.How Many Times Has TDP MLA Nandamuri Balakrishna Visited Hindupur?

అయితే తాజాగా ఒక అభిమాని పుట్టినరోజు సందర్భంగా బాలయ్య అతడికి ఊహించని విధంగా సర్ప్రైజ్ ఇవ్వడం జరుగుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. బాలకృష్ణ అనంతపురం జిల్లాలోని తన సొంత నియోజకవర్గం హిందూపూర్ లో ప్రస్తుతం పర్యటిస్తూ ఉన్నారు. ఇక తన కుటుంబంతో పర్యటనలో పాల్గొంటున్నారు. ఇక నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలని సంకల్పంతో బాలకృష్ణ ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు.

ఈ పర్యటన సందర్భంగా బాలయ్య తన అభిమానికి ఊహించని విధంగా ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. తన అభిమానిని పుట్టినరోజు అని తెలుసుకున్న బాలకృష్ణ అతని ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేయడమే కాకుండా అతనికి తన ఆశీస్సులు కూడా అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక బాలకృష్ణ తాము ప్రారంభించిన మొబైల్ వాహనం ద్వారా నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్య రధం ద్వారా ప్రత్యేక వైద్య బృందం ప్రజలకు వైద్య పరీక్షలు, ఉచిత వైద్యం అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.

https://twitter.com/PainaNagesh/status/1560070245812817920?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1560070245812817920%7Ctwgr%5E593ed91a536dd6284db218985b0edfd82f7f05a9%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Fsumantv-epaper-sumantv%2Fbalakrishnaabhimaanibartdebaalakrushnaichhinasarpraijmaamulugaledukada-newsid-n414445980%3Fs%3Dauu%3D0xcea82f0b848dd09css%3Dwsp