ఎన్టీఆర్ 31పై క్రేజీ అప్‌డేట్‌… డ్యూయెల్ రోల్‌తో ఊహించ‌ని ట్విస్ట్‌…!

త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా తన ఇమేజ్ ని పెంచుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. తాజాగా ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాలో నటన గాను ఆస్కార్ నామినేషన్ లో ఎంపికైనట్టు వార్తలు కూడా బయటకు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ ఇమేజ్ భారీగా పెరిగింది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ అవటం కూడా ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది.

Buchi Babu narrated story to Jr NTR?

ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత కొర‌టాల‌ డైరెక్షన్ లో ఎన్టీఆర్30 సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాను మేకర్స్ పాన్ ఇండియా లెవెల్ లో 9 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తర్వాత ఎన్టీఆర్ 31 సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు డైరెక్షన్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. బుచ్చిబాబు మొదటి ఉప్పెన సినిమాతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమా టైమ్ లో ఉన్న సన్నిహిత సంబంధాలతో బుచ్చిబాబు ఎన్టీఆర్ కి కథ చెప్పాడట. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్నదని సినీ వర్గాలలో టాక్. ఇందులో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లబోతుంది. ఈ వార్త బయటికి రావడంతో ఎన్టీఆర్ అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చింది.

Reel Buzz: NTR To Launch Two Films

Share post:

Latest