ఎన్టీఆర్ 30… ఇప్పట్లో లేనట్టేనా..?

NTR 30 To Get More Delay

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విధానం సూపర్బ్ గా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో చేసిన పర్ఫార్మెన్స్ తో ఆయనకు ఆస్కార్ అవార్డు వస్తుందనే చర్చ ఇటీవల సోషల్ మీడియాలో జోరందుకుంది.

అయితే తారక్ తన నెక్ట్స్ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇంకా ఈ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా, ఈ సినిమాను ఆగస్టులో పట్టాలెక్కిస్తారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తూ వచ్చింది. కానీ.. ఆగస్టు నెలాఖరు కూడా దగ్గరపడుతుండటంతో, ఈ సినిమా ఆగస్టులో స్టార్ట్ అయ్యే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదని.. ఇక సెప్టెంబర్ నెలాఖరున ఈ సినిమాను స్టార్ట్ చేసి, రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ లో నిర్వహిస్తారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ ఇంకా ఫైనల్ స్క్రిప్టును రెడీ చేయకపోవడమే దీనికి కారణమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ వార్తతో తారక్ అభిమానులు మరింత మండిపడుతున్నారు. ఇప్పటికే తమ హీరో సోలో మూవీ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుందని.. ఇప్పటికైనా తమ అభిమాన హీరో సినిమాను మొదలుపెడితే బాగుంటుందని వారు అంటున్నారు. ఈ లెక్కన వచ్చే ఏడాదిలో ఈ సినిమాను రిలీజ్ చేయడం కష్టంగానే కనిపిస్తుందని సినీ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.