“నాకు ఏ గాడ్ ఫాదర్ లేడు”..నిఖిల్ సంచలన వ్యాఖ్యలు..!!

యంగ్ హీరో నిఖిల్ హ్యాపీడేస్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమై హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన సొంత కష్టంతో తనకంటు హీరోగా స్థిర‌ప‌డ్డాడు. తాజాగా పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ పెంచుకున్నాడు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్ లో మంచి విజయాన్ని అందుకుని రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు. కార్తీకేయ 2 ఏకంగా రు. 100 కోట్ల క్ల‌బ్‌లోకి చేరుకోవ‌డం అంటే మామూలు విష‌యం కాదు.

Karthikeya 2's rare feat in North Indian Belt

ఈ దెబ్బ‌తో ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క‌ అన్న విధంగా నిఖిల్ కెరియర్ ఉండ‌బోతుంది. నిఖిల్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సక్సెస్ నాకు ముందుగానే దొరికేదేమో… కెరియర్ మొదట్లో తనకు గైడెన్స్ ఇచ్చేవారు లేకపోవటం వల్లనే ఇంతటి ఘనవిజయం ఆలస్యమైందని నిఖిల్ అభిప్రాయపడ్డాడు. కార్తికేయ 2 సినిమా సక్సెస్ నాకు మంచి ఆనందాన్నిఇచ్చిందని.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నేను ఇక్కడ వరకు రావటం గొప్ప విష‌యం అని నిఖిల్ ఆనందం వ్య‌క్తం చేశాడు.

Exclusive interview with Nikhil Siddharth ahead of release of Karthikeya 2

ఇక కెరీర్‌లో వ‌రుస ప్లాప్‌లు చూశాక నాకు ఏ కథ చేయాలో ? ఏ సినిమా చేలో అర్థమయ్యేది కాదు? ఎలా సినిమా తీయాలో ఎప్పుడు ఎలా ఉండాలో చెప్పడానికి నాకు గాడ్ ఫాదర్ లేరు. ఆ సమయంలో త‌న‌కు కూడా ఇండ‌స్ట్రీలో ఎవ‌రో ఒక‌రు గాడ్ ఫాదర్ ఉంటే బాగుండేదని అనిపించేది. అన్ని ప్లాప్‌లు తర్వాత స్వామిరారా సినిమాతో సూపర్ హిట్ అందుకోవ‌డంతో త‌న‌కు న‌మ్మ‌కం క‌లిగింద‌ని చెప్పారు.

Karthikeya 2 Trailer: Full of thrill

ఆ సినిమా తర్వాత నుంచి కథనే నమ్ముకుంటే మనకు హిట్‌ వస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుని మంచి క‌థ‌ల‌ను ఎంచుకోవ‌డం ప్రారంభించాన‌ని చెప్పారు. అప్ప‌టి నుంచి త‌న‌కు మంచి స‌క్సెస్‌లు వ‌చ్చాయంటూ నిఖిల్ భావోద్వేగానికి గుర‌య్యాడు. ఇప్పుడు నిఖిల్ వ్యాఖ్య‌లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest