పుష్ప2 నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది..

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన ఈ సినిమా అల్లు అర్జున్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు పుష్ప 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో పుష్ప 2 నుంచి ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ అప్ డేట్ తో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. ఈ సినిమా కోసం సుకుమార్ భారీగానే కసరత్తు చేస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటించింది. శ్రీవల్లిగా అందరినీ మెప్పించింది. పుష్ప 2 ఎప్పుడు వస్తుందా అని బన్ని ఫ్యాన్స్ ఎదురుచూశారు. ఈనేపథ్యంలో పుష్ప 2నుంచి బిగ్ అప్ డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీప్రసాద్..

పాన్ ఇండియాగా వచ్చిన పుష్ప ది రైజ్ పార్ట్ 1 తెలుగుతో పాటు అన్ని భాషల్లో విడుదల అయ్యి భారీ హిట్ అందుకుంది. ఇందులోని పాటలు, డైలాగులు అభిమానులను ఈలలు వేయించాయి. ఇక పుష్పరాజ్ ‘తగ్గేదేలా’ డైలాగ్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఫిదా అయ్యారు. శ్రీవల్లి, ఊ అంటావా పాటలు బాగా పాపులర్ అయ్యాయి. తాజాగా దేవీ శ్రీ ప్రసాద్.. పుష్ప 2 నుంచి ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. పుష్ప ది రూల్ కోసం అదరిపోయే పాటలను రెడీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మూడు పాటలను కంప్లీట్ చేశారట. ఈ అప్ డేట్ తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి మ్యూజిక్ తో దేవి శ్రీ ప్రసాద్ అదరగొడతారని అంటున్నారు.

పుష్ప ది రూల్ పార్ట్ 2 భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు కూడా ఇటీవల జరిగాయి. ఇక సెట్స్ పై మాత్రమే వెళ్లాల్సి ఉంది. పుష్ప 2 తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో సహా 10 భాషల్లో రాబోతుంది. పుష్ప 2 లోనూ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించనున్నారు.

Share post:

Latest