నిర్మాత దిల్ రాజు కామెడీ గట్రా చేయడం లేదుకదా? అని ప్రశ్నిస్తున్న నెటిజన్లు… విషయం ఇదే!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అందరికీ సుపరిచితుడే. సినిమాల విషయంలో దిల్ రాజు జడ్జ్మెంట్ పక్కాగా ఉంటుంది. అందుకే ఆయన తెరకెక్కించిన సినిమాలు దాదాపుగా హిట్టై తీరాల్సిందే. అయితే కరోనా సంక్షోభం తరువాత సినిమాల పరిస్థితి అద్వాన్నంగా తయారయ్యింది. మొదట సినిమా టిక్కెట్లు రేట్లు పెంచమని చెప్పిన వారే ఇపుడు సినిమా రేట్లు తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈమధ్య కాలంలో జనాలు ఎక్కువగా OTTలకు బాగా అలవాటు పడిపోయారు. దానివలన థియేటర్లకు వెళ్లని పరిస్థితి నెలకొంది.

ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ షూటింగ్ ల బంద్ విషయంలో దిల్ రాజు పేరే ప్రధానంగా వినిపించింది. ఎందుకంటే సినిమాల షూటింగ్ లు బంద్ అన్న ఆయనే తమిళ హీరో విజయ్ తో చేస్తున్న పినిమా షూటింగ్ ని ఆపకుండా కంటిన్యూ చేయడం పలు విమర్శలకు దారి తీసింది. అదేమంటే అది తెలుగు సినిమా కాదు.. తమిళ సినిమా కాబట్టే షూటింగ్ చేస్తున్నాం అంటూ లాజిక్కులు చెప్పి కవర్ చేసుకున్నాడు. దీంతో ప్రొడ్యూసర్స్ చాలా మంది షూటింగ్ లు టాలీవుడ్ సినిమాలే కాదు. టాలీవుడ్ నిర్మాతలు నిర్మించే సినిమాలన్నీ ఆపాల్సిందే అంటూ కామెంట్ లు చేయడం కొసమెరుపు.
by
ఈ విషయం అటుంచితే, తాజాగా దిల్ రాజు మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఆయనని వార్తల్లో నిలిచేలా చేసింది మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అని చెప్పుకోవాలి. దిల్ రాజు ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ లతో RC15 ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న సంగతి విదితమే. పీరియడిక్ టచ్ తో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ని ఇటీవల దర్శకుడు శంకర్ ఆపేసి కమల్ హాసన్ ఇండియన్ 2 కోసం వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ కారణంగా RC15 కు సంబంధించిన అప్ డేట్ ఇవ్వమని మెగా అభిమానులు ట్విట్టర్ వేదికగా దిల్ రాజుని డిమాండ్ చేస్తుండటం వైరల్ గా మారింది.

Share post:

Latest