ఆది పురుష్‌కు నెట్‌ఫిక్స్ కోట్లలో ఆఫర్.. కళ్లు చెదిరే పోవాల్సిందే!

స్టార్ హీరోలు, దర్శకుల సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎవరూ ఊహించని రీతిలో జరుగుతుంటుంది. గత కెరీర్ రికార్డు చూసి గుడ్డిగా భారీ ఆఫర్లను ముందుంచడం ఓటీటీ, టీవీ ఛానెల్స్‌కి చాలా కామన్. అయితే తాజాగా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ ప్రభాస్ ఆది పురుష్‌ సినిమాకి కనీవినీ ఎరుగని రీతిలో ఆఫర్ అందించింది. నిజానికి ఆదిపురుష్‌ ఫస్ట్ లుక్ ఇంకా విడుదల కాలేదు. ప్రభాస్ ఎలాంటి గెటప్‌లో అలరిస్తాడో కూడా ఇంకా తెలియలేదు. అయినా కూడా ఆ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్‌లో జరుగుతోంది. ప్రభాస్ సాహో రాధేశ్యామ్ తో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకున్న కూడా అతని బ్రాండ్ వాల్యూ కొంచెం కూడా తగ్గలేదు. అందుకు తాజా నెట్‌ఫ్లిక్స్‌ ఆఫర్ నిదర్శనంగా నిలుస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఆదిపురుష్‌ మూవీకి సంబంధించిన అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ను రూ.250 కోట్లకు కొనేసిందని ప్రస్తుతం బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. ఏ ఇండియన్ సినిమాని కూడా రిలీజ్‌కి ముందే ఇంత మొత్తంలో డబ్బు పెట్టి కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. దాంతో డార్లింగ్ ప్రభాస్ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసినట్లయింది. ఈ అమౌంట్ ఆల్ టైమ్ రికార్డు అని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. రామాయణం ఆధారంగా మైథలాజికల్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను పలకరించనుంది. ఇలాంటి మూవీ డిజిటల్ రైట్స్ కోసం ఒక ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థ రూ.250 కోట్ల పెట్టడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఓం రౌత్ ఈ మూవీ షూటింగ్ పనులను చాలా రోజుల క్రితమే పూర్తి చేశారు. ఇప్పుడు కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share post:

Latest