నాగ‌చైత‌న్య కెరీర్ డిజాస్ట‌ర్ ‘ థ్యాంక్యూ ‘ మూవీ క్లోజింగ్ క‌లెక్ష‌న్లు… ఘోర అవ‌మానం…!

అక్కినేని హీరో నాగ‌చైత‌న్య కెరీయ‌ర్ థ్యాంక్యూ ముందు వ‌ర‌కు ఒక రేంజులో ఉండేది. త‌న మాజీ భార్య స‌మంత‌తో మ‌జ‌లి, ఆ త‌ర్వాత ల‌వ్‌స్టోరి, తండ్రితో చేసిన మ‌ల్టీస్టార్ బంగార్రాజు లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్‌లు కొట్టాడు. అలాగే మేన‌మామ వెంక‌టేష్ తో క‌లిసి న‌టించిన మల్టీ స్టార్ వెంకీమామ కూడా సూప‌ర్ హిట్ అయింది. అంత‌ క్రేజ్‌తో చైతు రేంజ్ థ్యాంక్యూ సినిమాతో ఒక‌సారిగా డౌన్ అయిపోయింది. చిరంజీవి ఆచార్య‌తో ఎంత ట్రోలింగ్‌కు గుర‌య్యాడో.. థ్యాంక్యూ సినిమాతో నాగ‌చైత‌న్య కూడా అంతే ట్రోలింగ్ కు గురయ్యాడు.

త‌న‌కు క‌లిసి రాని దిల్ రాజు బ్యాన‌ర్లో చేసిన ఈ సినిమా ఘెర‌మైన అవ‌మానాన్ని మిగిల్చింది. చైతు మొద‌టి సినిమా జోష్‌ అదే దిల్ రాజు బ్యాన‌ర్లో వ‌చ్చి ప‌రాజ‌యం పాలైంది. ఇప్పుడు రెండో సినిమా థ్యాంక్యూతో మారోసారి ఘోరంగా నిర‌శ ప‌రిచాడు. థాంక్యూ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఆడదని విషయం తెలుసుకున్న నిర్మాత దిల్ రాజు రెండో రోజు నుంచి సినిమా ప్రమోషన్లు ఆపేశారు. ఈ రకంగా నాగచైతన్యకు దిల్ రాజు కాంబినేషన్ లో రెండో డిజాస్టర్ గా మిగిలిపోయింది.

విక్రమ్ కే కుమార్ అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి మెమొరబుల్ హిట్ ఇచ్చాడు. ఆ అభిమానంతో నాగచైతన్య థాంక్యూ సినిమా చేశాడు. ఈ సినిమా ఎవరు ఊహించిన విధంగా ఘోరమైన పరాజయం పాలయ్యింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్ విషయాని కొస్తే తెలుగు రాష్ట్రాల్లో కేవలం మూడు కోట్ల 35 లక్షల రూపాయలు షేర్ మాత్రమే వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు నాలుగు కోట్ల 45 లక్షల రూపాయలు షేర్ మాత్రమే వచ్చింది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే 25 కోట్ల రూపాయలు దాకా వెళ్ళింది. అటు ఇటుగా చూస్తే బయ్యర్లు రు. 20 కోట్లు నష్టపోయారన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో థాంక్యూ సినిమాకు వచ్చిన క్లోజింగ్ కలెక్షన్ ఇవే.

నైజాం – 1.24 కోట్ల
సీడెడ్ – 38 లక్షలు
ఉత్తరాంధ్ర – 66 లక్షలు
ఈస్ట్ – 30 లక్షలు
వెస్ట్ – 17 లక్షలు
గుంటూరు – 23 లక్షలు
కృష్ణా – 25 లక్షలు
నెల్లూరు – 12 లక్షలు

Share post:

Latest