మహేష్ వద్దు అనుకున్న దాని పై ఆశ పడ్డ బన్నీ.. ఫ్యాన్స్ ని రెచ్చకొడుతున్నారుగా..!?

ఇటీవ‌ల‌ భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను హారర్ గర్ తిరంగా అనే పేరుతో దేశ‌వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించారు. ఇదే క్రమంలో ఇతర దేశాలలో నివసిస్తున్న భారతీయులు కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుక‌ల‌ను ఘనంగా నిర్వహించారు. తాజాగా అమెరికాలో జ‌రిగిన‌ భారత 75వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో అల్లు అర్జున్ పాల్గొన్నారు.

Allu Arjun: భారత్ కా తిరంగా.. కభీ ఝుకేగా నహీ, న్యూయార్క్ ఇండియా ప‌రేడ్ కు  అల్లు అర్జున్ నాయ‌క‌త్వం

బ‌న్నీ పాల్గొన్న ఈ ఈవెంట్లో మ‌నోడు బాగా హైలెట్ అయ్యాడు. ఇప్పుడు ఈవెంట్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తుంది. బన్నీ కంటే ముందు ఈవెంట్ కి మహేష్‌ని ముఖ్య అతిథిగా రమ్మని అడిగారట. మహేష్ కి కుదరకపోవడంతో ఆయన నో చెప్పారట. ఆ త‌ర్వాత బ‌న్నీ ఈ ఈవెంట్‌కు వెళ్లాడు.

Tollywood Stars Allu Arjun And Mahesh Babu Share Adorable 'Raksha Bandhan'  Pics Of Their Kids

ఇప్పుడు దీన్ని సోషల్ మీడియా వ్యాప్తంగా మహేష్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. మహేష్ రానున్న దానికి బన్నీ వెళ్లారంటూ మ‌హేష్ ఫ్యాన్స్‌.. మా హీరోకు అద్భుత గౌర‌వం ద‌క్కిందంటూ బ‌న్నీ ఫ్యాన్స్ ఒక‌రికొక‌రు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు. అయితే ఈ వార్ గ‌తం నుంచి బ‌న్నీ ఫ్యాన్స్‌ వ‌ర్సెస్ మ‌హేష్ ఫ్యాన్స్‌ మ‌ధ్య ఉన్న అగాధాన్ని పెంచేలా ఉంది

Share post:

Latest