మళ్లీ అదే తప్పు చేస్తున్న మెగా డాటర్..ఇంకా బుద్దిరాలేదా..!?

యస్ ఇప్పుడు ఇదే అంటున్నారు కొందరు నెటిజన్స్. మనకు తెలిసిందే మెగా ఫ్యామిలీలో సినీ హీరోలకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మెగా డాటర్ నిహారిక. ఆఫ్ కోర్స్ మెగా డాటర్స్ ఎంతమంది ఉన్నా నిహారిక అల్లరి ..నిహారిక అందం ..నిహారిక చిలిపితనం.. వేరే వాళ్ళకి లేదని చెప్పాలి . సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చిన నీహారికను.. మెగా అభిమానులు ఆమెని హీరోయిన్ గా నెట్టుకు రానివ్వలేదు. మెగా డాటర్స్ అంటే దేవతలాగే చూసేవాళ్ళకి నిహారిక ఒక మనసు సినిమాలో హీరోయిన్ గా చేసిన పనులు నటించిన తీరు జీర్ణించుకోలేకపోయారు.

దీంతో సినిమాను అట్టర్ ఫ్లాప్ చేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నీహారిక నటించినా సేమ్ అదే రిజల్ట్ ని కంటిన్యూ చేశారు ఫాన్స్. దీంతో నీహారిక ఈ సినిమా తిప్పలు మన వల్ల కాదు అనుకుని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. అబ్బో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న నీహారిక అప్పట్లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వీళ్ళ పెళ్లి ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. ఇతనే నా భర్త అనే విషయాని చెప్పడానికి మెగా డాటర్ చేసిన హంగామా ..చెప్పిన తీరు ఇప్పటికే మర్చిపోలేం. ఓ కాఫీ కప్ పై మిస్సెస్ నిహారిక అంటూ హింట్ ఇచ్చి ..ఆ తర్వాత ముఖం కనబడకుండా అతని హగ్ చేసుకున్న ఫోటోని రిలీజ్ చేసి.. ఆ తరువాత ఎట్టకేలకు ఇతనే నా భర్త అంటూ అసలు ఫోటోలు రివీల్ చేసింది. ఎట్టకేలకు ఘనంగా పెళ్లి చేసుకుంది నిహారిక.


పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత నిహారిక మాత్రం చాలా మారిందనే చెప్పాలి. పెళ్ళికి ముందే పద్ధతిగా ఉండేది ఈ మెగా డాటర్. పెళ్లి తర్వాత అస్సలు పద్ధతులు ఫాలో అవ్వట్లేదు అంటున్నారు కొందరు నెటిజన్స్. “ఇష్టం వచ్చిన్నట్లు తిరుగుతూ.. నచ్చిన్నట్లు ఉంటూ.. పెళ్ళైన ఆడపిల్ల వే నా నువ్వు ” అని అనిపించేలా ఉందట. ఈమధ్య నిహారిక పేరు మీడియాలో మారు మ్రోగిపోయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు తన జిమ్ ట్రైనర్ తో చేసిన వెక్కిలి చేష్టలు.. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఇష్యూ మనకు తెలిసిందే. దీంతో నిహారిక సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉన్నింది.

కొన్నాళ్లు సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్ చేసిన నిహారిక మళ్లీ ఈ మధ్యకాలంలో యాక్టివ్ గా మారింది రీసెంట్ గా మెగా డాటర్ నిహారిక తన భర్తతో కలిసి జిమ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఈ ఫోటోలు క్షణాల్లోనే వైరల్ గా మారాయి. నిజానికి చైతన్య చాలా సైలెంట్ అంటుంటారు. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు.. తన పని తాను చూసుకో పోయే టైప్. కానీ మెగా డాటర్ అలా కాదు అల్లరి పిల్ల ..చెప్పిన మాట అస్సలు వినదు ..చెయ్యొద్దు అన్న పనినే చేస్తూ ఉంటుంది అంటూ సరదాగా చాలామంది మెగా హీరోలు చెప్పుకొచ్చారు.

కాగా రీసెంట్ గా నిహారిక జిమ్ ఫొటోస్ చూసిన నెటిజన్స్ ఆమెపై మళ్ళి విరుచుకుపడుతున్నారు. “ఇప్పుడిప్పుడే నీ లైఫ్ సెటిల్ అవుతుంది అనుకుంటున్నాము నిహారిక”.. “మళ్ళీ ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసి నీ లైఫ్ సమస్యల్లో పడేసుకోకు”.. “భర్తతో హ్యాపీగా ఉండు” ..అని కొందరు అంటుంటే ..మరికొందరు “ఈ మెగా డాటర్ కి ఇక బుద్ధి రాదా..? సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ ..బుద్ధిగా సంసారం చేసుకోవచ్చుగా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest