ఆ నిర్ణయం వల్లే మహేష్ హీరోయిన్ కెరియర్ పతనమయిందా..?

మహేష్ బాబు హీరోగా రక్షిత హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం నిజం. ఈ సినిమా ద్వారా రక్షిత తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంది. ఇకపోతే ఈమె మొదటిసారి సినీ ఇండస్ట్రీలోకి మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఇడియట్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైందని చెప్పవచ్చు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది రక్షిత. నిజానికి రక్షిత.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మొదటిసారి కన్నడ ఇండస్ట్రీలో నటించింది .అక్కడ అప్పు పేరుతో తెలుగు ఇడియట్ సినిమా కంటే ముందే పూరి జగన్నాథ్ ఒక సినిమాను తెరకెక్కించాడు.Neelo Vunnadi Full Video Song || Nijam Movie || Mahesh Babu, Rakshitha -  YouTubeఇక ఈ సినిమాలో కూడా రక్షిత హీరోయిన్గా నటించింది ఇక ఆ హీరోయిన్ నే పూరి జగన్నాథ్ ఇడియట్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు . ఇక ఓకే డైరెక్టర్.. ఓకే సినిమా కథతో.. రెండు భాషల సినీ ప్రేక్షకులకు పరిచయమయింది. ఇక రక్షిత ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలోని వచ్చిన ఎన్నో సినిమాలలో నటించింది. ఇక అలా శివమణి , పెళ్ళాం ఊరెళితే , నిజం వంటి చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కెరియర్ పీక్స్ లో వున్న సమయంలో సీనియర్ హీరోల సినిమాలలో అవకాశం రావడంతో ఆంధ్రావాలా, చిరంజీవితో అందరివాడు ఇలా సినిమాలు చేసి తప్పు నిర్ణయం తీసుకుంది అని చెప్పవచ్చు .ఎందుకంటే అప్పుడప్పుడే తన కెరియర్ మంచి విజయం వైపు దూసుకుపోతున్న నేపథ్యంలో ఇలా సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకొని యంగ్ హీరోలకు తల్లి పాత్రలో నటించింది.Mahesh Babu actress goes unrecognized

- Advertisement -

కెరియర్ మొదట్లోనే తల్లి పాత్రలు అంటే ఇక ప్రేక్షకులు ఆ తర్వాత ఆమె హీరోయిన్గా ఆదరించలేకపోయారు. అలా ఆమె తీసుకున్న ఆ నిర్ణయం వల్ల తన కెరీర్ మొత్తం నాశనం అయ్యింది. ప్రాధాన్యత లేని పాత్రలు ఎంచుకోవడం వల్ల తన కెరియర్ ఇరుకున పడింది అని వార్తలు వినిపించాయి. అలా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాన్ని కూడా కోల్పోయింది రక్షిత .కానీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోవడం చాలా బాధాకరం.

Share post:

Popular