మ‌హేష్ ఆ స్టార్ హీరోతో మ‌రో సీత‌మ్మ వాకిట్లో రెడీనా…!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు – సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ డూపర్ హిట్ అయింది. అసలు టాలీవుడ్ లో ఈ తరం స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తారన్న ఆశలు ఎవరికి ఉండేవి కాదు. అలాంటి సమయంలో మహేష్ – వెంకటేష్ ఇద్దరూ పెద్ద డేరింగ్ స్టెప్ వేసి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతోనే చాలామంది హీరోలు ఆ తర్వాత మల్టీస్టారర్ సినిమాలు చేశారు.

Seethamma Vakitlo Sirimalle Chettu - Disney+ Hotstar

నిజం చెప్పాలంటే ఈ సినిమా తర్వాతే గోపాల గోపాల – మసాలా – ఆచార్య – త్రిబుల్ ఆర్ – భీమ్లా నాయక్ లాంటి మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన మ‌ల్టీస్టార‌ర్ వ‌స్తుంద‌న్న చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అదే నాగార్జున – మ‌హేష్‌బాబు మ‌ల్టీస్టార‌ర్‌. తాజాగా నాగార్జున ది ఘోస్ట్ సినిమా ట్రైలర్ మ‌హేష్‌బాబు విడుదల చేసిన విషయం తెల్సిందే.

Is Nagarjuna Akkineni Upset With Mahesh Babu Over The Latter's Next Film? -  Filmibeat

ఈ సంద‌ర్భంగా ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న స్నేహం నేప‌థ్యంలో త్వరలోనే మరో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఫ్యామిలీ మల్టీస్టారర్ వచ్చే అవకాశాలు ఉన్నాయ‌న్న చ‌ర్చ‌లు అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో స్టార్ట్ అయ్యాయి. గ‌తంలో నాగార్జున , మ‌హేష్ తండ్రి క‌లిసి న‌టించారు. ఇప్పుడు మ‌న‌మిద్ద‌రం ఎప్పుడు సినిమా చేద్దామ‌ని నాగ్ ప్ర‌శ్నించిన వెంట‌నే త‌ప్ప‌కుండా అని మ‌హేష్ ఆన్స‌ర్ ఇచ్చాడు.

Mahesh Babu plays an intelligence officer in AR Murugadoss' next -  Hindustan Times

ఏదేమైనా వీరిద్దరు కలిసి సినిమా చేసేందుకు చాలా ఆసక్తిగానే కనిపిస్తున్నారు. అయితే ఈ ఇద్దరిని మెప్పించగల సత్తా ఉన్న దర్శకుడు.. అందుకు తగ్గ కథ.. బ‌డ్జెట్ పెట్టే నిర్మాత కావాల్సి ఉంటుంది.

Share post:

Latest