‘ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌.. నితిన్ టార్గెట్ ఎన్ని కోట్లంటే…!

యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలవుతోంది. నితిన్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు. భీష్మ తర్వాత నితిన్ న‌టించిన ఏ సినిమా స‌క్సెస్‌ చూడలేదు. చెక్ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఆ వెంటనే వచ్చిన రంగ్ దే సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రీతిలో అల‌రించ‌లేక‌పోయింది.

ఆ రెండు సినిమాలు కమర్షియల్ గా భారీ నష్టాలు చూసాయి. నితిన్ ఇప్పుడు మాత్రం మాచర్ల నియోజకవర్గం సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల‌నుకుంటున్నాడు. ఇక నితిన్ తాజా సినిమా మాచర్ల నియోజకవర్గం నైజాం ఏరియాలో 6 కోట్ల ధరకు అమ్ముడవగా… సీడెడ్ లో 3 కోట్లు – ఆంధ్రాలో 10 కోట్లకు అమ్ముడైంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రు. 19 కోట్ల వరకు బిజినెస్ చేసింది.

ఈ సినిమా ఇత‌ర బాష‌ల‌లో రూ. 1 కోటి వ‌ర‌కు బిజినెస్ చేసింది. ఓవ‌ర్సీస్ లో కూడా రూ. 1. 20 కోట్లు బిజినెస్ చేసింది. మొతంగా ఈ సినిమా 21.20 కోట్లు బిజినెస్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ సినిమాగా నిల‌వాలంటే మొత్తంగా రూ. 22 కోట్టు రాబ‌ట్టాలి. పైగా శ‌నివారం కార్తికేయ 2 సినిమా రిలీజ్ కానుంది. అటు బింబిసార‌, సీతారామం థియేట‌ర్ల‌లో స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో నితిన్ సినిమాకు హిట్ టాక్ వస్తేనే క‌లెక్ష‌న్లు వ‌స్తాయి.

Share post:

Latest