లైగర్ ప్రీ రిలీజ్ బిజినెస్..విజయ్ టార్గెట్ ఎన్ని కోట్లంటే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. తాజాగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న లైగర్ సినిమాలో నటించారు. ఈ సినిమా గత రెండు సంవత్సరాలుగా సెట్స్ మీదే ఉన్నది. ఈ సినిమాతో పూరి పాన్ ఇండియా డైరెక్టర్గా మారబోతున్నాడు. ఇటీవలే విడుదలైన టీజర్స్, సాంగ్స్ ఈ సినిమా పబ్లిసిటీకి మరింత దోహదపడ్డాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా బిజినెస్ గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.Vijay Deverakonda and Not Karan Johar Conceived the Idea Behind Viral Liger  Poster?లైగర్ సినిమా బాలీవుడ్ లో క్లోజ్ అయినట్లుగా తెలుస్తుంది. తెలుగు డీల్ మాత్రం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుతో ముందే ఫిక్స్ అయిపోయింది. అయితే రేటు ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నట్లుగా సమాచారం. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను మొత్తం అన్ని భాషలలో లైగర్ సినిమాను దాదాపుగా రూ. 70 కోట్లకు పైగా తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇక దాదాపుగా దక్షిణాది రాష్ట్రాలలో అన్ని వైపుల కొనుగోలు చేశారు. అయితే మరో రూ.10 కోట్ల రికవరీ అడ్వాన్స్ గా ఇవ్వాలని పూరి జగన్నాథ్ కోరుతున్నట్లుగా సమాచారం .ఇదంతా ఇలా ఉండగా ఆంధ్ర ఏరియాను రూ. 30 కోట్ల కు సినిమా బిజినెస్ క్లోజ్ అయినట్లుగా తెలుస్తున్నది.Liger Film Release Date, Cast, Story, Budget, Poster & Trailer | Odisha  Viewsఇక ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ పరిసర ప్రాంతాలలో డైరెక్టర్ కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ రూ.30 కోట్ల కు ఈ సినిమా తీసుకున్నట్లుగా తెలుస్తున్నది .అంటే విశాఖ ఏరియా రూ.7.30 కోట్లకు, ఈస్ట్ గోదావరి ఏరియాలలో భరత్ చౌదరి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన పరిసరాల ప్రాంతాలలో డిస్ట్రిబ్యూటర్లు ఇంకా డిస్కషన్ లో ఉన్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా మొదటిసారిగా పాన్ ఇండియా హీరోగా పేరు పొందుతున్నాడు విజయ్ దేవరకొండ. ఇందులో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్నది. డైరెక్టర్ పూరి కూడా తన మొదటి చిత్రం పాన్ ఇండియాగా లైగర్ నే తెరకెక్కించడం గమనార్హం.