లైగర్ సినిమా ఓటిటి లో ప్రసారమయ్యేది అప్పుడే..!!

సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. యువ హీరో విజయ్ దేవరకొండ కలిసి తెరకెక్కించిన చిత్రం లైగర్. ఇందులో హీరోయిన్ గా అనన్య పాండే నటించింది. ఈ సినిమాకి నిర్మాతగా చార్మి , పూరీ, కరణ్ జోహార్ వ్యవహరించారు. ఇందులో మైక్ టైసన్ ఒక కీలకమైన పాత్రలో నటించారు. ఇక రమ్యకృష్ణ కూడా విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఓటీటి లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.Liger Movie OTT Release Date – Digital Rights | Watch Online Streaming  Online – OTT Raja

ఈ సినిమా తో మొదటిసారిగా విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లెవెల్ లో హీరో కాబోతున్నాడు. ఇక ఎవరు ఊహించని స్థాయిలో రేంజ్ ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇక ఈరోజు ఈ సినిమా విడుదలై మంచి ఓపెనింగ్స్ అందుకున్నాయని ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. మరి విడుదలకు ముందే క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం.. మరి ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ ఎవరో బయటకు రావడం జరిగింది ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఓటీటి హక్కులను ప్రముఖ ఓటిటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమాని భారీ మొత్తంలో ఖర్చుపెట్టి ఈ సినిమాని కొనుగోలు చేసినట్లుగా సమాచారం. తాజాగా నిబంధనల ప్రకారం ఈ సినిమా 50 రోజుల తర్వాతనే ఓటీటీ లో విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈరోజు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లెవెల్లో మొదటిసారి నటిస్తున్నప్పటికీ.. ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారని చెప్పవచ్చు.

Share post:

Latest