‘ లైగ‌ర్ ‘ ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌… రెండో రోజే దుకాణం బంద్‌..!

భారీ క్రేజ్‌తో వ‌చ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ – పూరి జ‌గ‌న్నాథ్ లైగ‌ర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 9.60 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబ‌ట్టింది. ఇది హీరో విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్. ఇక ఉప్పెన సినిమా సాధించిన ఫ‌స్ట్ డే షేర్ రికార్డ్ రు. 9.20 కోట్లు షేర్ అధిగమించింది. ప్రపంచ వ్యాప్తంగా 13.35 కోట్ల షేర్, 24.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

సినిమాపై ఉన్న భారీ హైప్ నేప‌థ్యంలో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి. యూఏస్ఏలో ప్రీమియర్స్ నుంచి $500k కలెక్ట్ చేసింది. అయితే ప్రీమియర్ షోలకే నెగెటివ్ టాక్ రావడంతో రెండో రోజు ఎవ్వ‌రూ కూడా సినిమా చూసే ధైర్యం చేయడం లేదు. చాలా మంది బుకింగ్స్ చేసుకున్న వాళ్లు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను రూ. 55 కోట్లకు అమ్ముడయ్యాయి. రెండో రోజు వ‌సూళ్లు ఘెరంగా ప‌డిపోవ‌డంతో లైగ‌ర్‌కు భారీ న‌ష్టాలు త‌ప్పేలా లేవు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా రు. 90 కోట్ల బిజినెస్ చేసింది. అందులో స‌గం కూడా షేర్ వ‌చ్చేలా లేదు. లైగ‌ర్ ఫస్ట్ డే నైజాంలో 4.20 కోట్లు కలెక్ట్ చేయగా.. సీడెడ్ లో 1.40 కోట్లు – ఉత్తరాంధ్ర లో 1.27 కోట్లు వసూలు చేసింది.

Share post:

Latest