లేటు వయసులో ఘాటు అందాలతో కాకరేపుతున్న మీరా జాస్మిన్!

మీరాజాస్మిన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. తమిళంలో ఆమె చేసిన కొన్ని సినిమాలతోనే తెలుగువాళ్ళకు పరిచయం అయింది. ఆ తరువాత తెలుగులో నేరుగా చేసిన సినిమాలతో డైరెక్ట్ గా మనవాళ్లకు కనెక్ట్ అయ్యింది. అచ్చం తెలుగు అమ్మాయి మాదిరిగా కనిపించడం ఆమె ప్రత్యేకత. దాంతో తెలుగులో ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘గుడుంబా శంకర్’ సినిమాలో చేసిన సంగతి తెలిసినదే. అయితే మీరా పెళ్లైన తరువాత సినిమాలకు దూరమైన సంగతి కూడా అందరికీ తెలిసినదే.

ఇకపోతే, ఆమె తాజాగా సౌత్ లో మరలా రీఎంట్రీ ఇచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోని మీరా జాస్మిన్ తన లుక్ ని పూర్తిగా మార్చుకుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మీరా బేసిగ్గా బొద్దుగా ఉంటుంది. అయితే ఆమె తాజా ఫోటోలు చూస్తే, కాస్త బరువు తగ్గినట్టు కనబడుతోంది. ఇందుకోసం ఆమె జిమ్ములో ఎక్కువగా శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా ఫోటో షూట్లతో తను ఒంపు సొంపులతో కుర్రకారుకి బాగా హీటెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మీరా జాస్మిన్ బేసిగ్గా ట్రెడిషనల్ లుక్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ నేటి తరం ప్రేక్షకుల తీరు మారడంతో ఈమె కూడా వారికి తగ్గట్టుగానే తనని తాను మలచుకుంటోంది. తాజాగా తెలుగులో ఒక స్టార్ హీరో సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అతను మరెవరో కాదు.. నందమూరి బాలకృష్ణ. అవును… అనిల్ రావుపూడి దర్శకత్వంలో వస్తున్న ఒక చిత్రంలో ఈమె నటిస్తున్నదని టాక్ వినిపిస్తోంది. రవితేజ భద్ర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మీరాజాస్మిన్ ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించిన సంగతి అందరికీ విదితమే. రీ ఏంట్రీ ఆమెకి ఎలాంటి అనుభవాలు మిగుల్చుతుందో చూడాలి మరి.