నిన్నటివరకు ఆ హీరోయిన్ డిమాండ్ చేసేది.. కథ అడ్డం తిరగడంతో బతిమిలాడుకుంటుందా?

సినిమా ఇండస్ట్రీ అంటేనే దూరపు కొండలు నునుపు మాదిరి. చూడటానికి ఇది రంగుల ప్రపంచంలాగ కనిపిస్తున్నా లోలోపల ఎన్నో అగాధాలు ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్లకు చాలా ఛాలెంజింగ్స్ ఉంటాయి. ఇక అసలు విషయానికొస్తే, సినిమా పరిశ్రమలో క్రేజ్ అందుకున్న హీరోయిన్ల కంటే వాళ్ల తల్లిదండ్రులే క్రేజ్ దక్కించుకున్నంత ఎక్కువ ఫీల్ అవుతారు. ఇండస్ట్రీలో తమ కూతురు ఒక్కతే టాప్ పొజిషన్ లో ఉంది అన్నమాదిరి బిహేవ్ చేస్తూ వుంటారు. ఇక అదే హీరోయిన్ కు ఇండస్ట్రీలో వరుస ప్లాపులు వస్తే కాళ్లబేరానికి వస్తుంటారు. ప్రస్తుతానికి అలాంటి ఒక పరిస్థితిని ఎదుర్కొంటోంది మన కృతి శెట్టి.

అవును… ఉప్పెన సినిమాతో బేబమ్మగా తెలుగు కుర్రాళ్ళ హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారి స్టార్ హీరోల సరసన కూడా అవకాశాలు చేజిక్కించుకుంది. అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కృతి శెట్టి సినీ ఇండస్ట్రీకి బుల్లితెరపై బాలనటిగా అడుగుపెట్టి ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించింది. దీంతో ఈ అమ్మడి తన క్రేజ్ ను ఏకంగా హీరోయిన్ వరకు సంపాదించుకుంది.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ వరుస పరాజయాలు అమ్మడిని డిఫెన్స్ లోకి నెట్టేశాయి. అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా పరిచయమై మంచి క్రేజ్ తో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్టు తో బాగా హల్ చల్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఈమెను దర్శకులు పట్టించుకోవటం లేదని తెలుస్తుంది. ముఖ్యంగా ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అని ముద్ర కూడా వేసేశారు. ఇదంతా పక్కన పెడితే కృతి శెట్టి తల్లి కృతి సెట్ స్టార్ పొజిషన్లో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్లతో ఎక్కువ మనీ డిమాండ్ చేసేదట. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరగడంతో కాళ్లబేరానికి వస్తుందని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి.

Share post:

Latest