‘ కార్తీకేయ 2 ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌.. నిఖిల్ టార్గెట్ ఎన్ని కోట్లు అంటే…!

నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ జంట‌గా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా కార్తికేయ 2. రేపు కార్తీకేయ 2 పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్ అయ్యింది. ఓపెనింగ్స్ బాగా ఉంటాయని అంటున్నారు. 2013లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వస్తుంది. సినిమా ఆరంభం నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

సినిమా ఎన్నిసార్లు వాయిదా ప‌డినా యూనిట్ మాత్రం కథ మీద నమ్మకంతో టీజర్- ట్రైలర్- పాటలకు హైప్ రావ‌డంతో న‌మ్మ‌కంతో ఉంది. ఈ సినిమా బిజినెస్ వివరాల్లోకి వెళితే నైజాంలో రు. 4 కోట్లు, సీడెడ్ లో 2 కోట్లు, ఆంధ్రాలో 6 కోట్లకు అమ్మారు. ఓవ‌రాల్‌గా ఏపీ, తెలంగాణ‌లో రు. 12 కోట్ల వరకు బిజినెస్ చేసింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 80 లక్షలు, ఓవర్సీస్ లో రూ.1.80 ల‌క్ష‌ల‌కు అమ్మారు.

మొత్తంగా కార్తికేయ 2 తెలుగులో రు. 14.20 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా కి 15 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టు. కార్తీకేయ 2 సినిమా ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది. మిగిలిన భాషల్లో మొత్తంగా రు. 3 కోట్ల వరకు బిజినెస్ చేసింది. కార్తీకేయ 2 హిట్ అవ్వాలంటే మొత్తంగా 18 కోట్లు వరకు రావాల్సి ఉంటుంది. మరి నిఖిల్ ఏం చేస్తాడో రేపు తేలిపోనుంది.

Share post:

Latest