కార్తికేయ 2 సినిమా అంచనాలను అందుకుందా?

యంగ్ హీరో నిఖిల్ గురించి పరిచయం అక్కర్లేదు. హ్యాపీ డేస్ తో తెలుగు పరిశ్రమకి పరిచయం అయిన నిఖిల్ కధల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తూ.. ముందుకు సాగిపోతున్నాడు. అందువలన తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాలు హిట్టైన తరువాత నిఖిల్ తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. మధ్యలో పరాజయాలు బాధపెట్టినా.. ‘అర్జున్ సురవరం’తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఇపుడు తాజాగా ‘కార్తికేయ 2’ సినిమాతో మరోసారి తన స్టామినాను నిరూపించుకున్నాడు.

చందూ మొండేటి దర్శకత్వం వహించిన ‘కార్తికేయ 2’ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎనిమిదేళ్ల కిందట సూపర్ హిట్ అందుకున్న ‘కార్తికేయ’ సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. అయితే ఆ సినిమాకి ఇది కొనసాగింపు కాకుండా ఓ సరికొత్త కథతో ‘కార్తికేయ 2’ రూపొందింది. ఈపాటికే సినిమా రివ్యూస్ బయటకు వచ్చేసాయి. మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రని పోషించారు.

ఇక తాజాగా USలో ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షోలు పడగా.. సినిమా హిట్ అంటూ నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ముందే తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. దాంతో ఎర్లీ మార్నింగ్ నుండే ఈ సినిమా పాజిటివ్ వైబ్ ని సొంతం చేసుకుంది. ఇపుడు తాజాగా పలు మీడియా సంస్థలు కూడా ఈ సినిమా బాగుందని.. సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయిందని అంటున్నారు. కాబట్టి ఈనెలలో దీనితో వరుస మూడు సినిమాలు హిట్టయినట్టు లెక్క. దర్శకుడు చందూ మొండేటి.. ప్రతీ ఫ్రేమ్‌ను అద్భుతంగా మలిచాడని.. ఎక్కడా కూడా మిస్ కాకుండా మంచి సినిమాను అందించాడని ఫ్యాన్స్ అంటున్నారు.

Share post:

Latest