క‌ర‌ణ్ సెక్స్ ప్ర‌శ్న‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన స్టార్ హీరోయిన్‌..!

బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షో కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు మరి. రీసెంట్‌గా కాఫీ విత్ కరణ్ సీజన్ 7 షో స్టార్ట్ అయింది. ఈ షో బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ షోకు వెళ్లాలంటే సెలబ్రిటీలు భయపెడుతున్నారు. తాజాగా మిస్టర్ పర్ఫెక్ట్ గా పిలిపించుకునే అమీర్ ఖాన్ – స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ ఈ షోలో పాల్గొని సందడి చేశారు. లాల్‌సింగ్ చ‌ద్దా ప్ర‌మోష‌న్ల‌లో వీరు ఈ షోకు వెళ్లారు.

దానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందరిలాగానే వీరిని కూడా అడల్ట్ సెక్స్ ప్ర‌శ్న‌ల‌తో ఇబ్బంది పెట్టి.. వారితోనే కౌంటర్ కూడా వేయించుకున్నాడు హోస్ట్ కరణ్ . కాఫీ విత్ కరణ్ సీజన్ 7 ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఐదో ఎపిసోడ్ లో అమీర్ ఖాన్, కరీనాకపూర్ గెస్టులుగా వచ్చి సందడి చేశారు. కరణ్ కరీనాను సెక్స్ లైఫ్ కు సంబంధించిన ప్రశ్నలు అడిగాడు. సెక్స్ కల్పితమా..? వాస్తవమా..? అని కరీనా అని అడిగాడు.

 

కరీనా వెంటనే అది నీకు తెలియదా ? అని ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఆ మాటకి కరణ్ దిమ్మతిరిగిపోయింది. “మా అమ్మ కూడా ఈ టాక్ షో చూస్తూ ఉంటుంది, నువ్వు నా సెక్స్ లైఫ్ గురించి చెడుగా మాట్లాడతావా ?” అని వాపోయాడు. వెంటనే పక్కనున్న అమీర్ కల్పించుకొని మరి”.. మీ అమ్మ ఇతరుల పర్సనల్ లైఫ్ గురించి ప్ర‌శ్నిస్తే ఏం అనుకోదా “అంటూ కరణ్ కు కౌంటర్ ఇచ్చాడు. ఇలా సెలబ్రిటీలతో ఈసారి గట్టిగా కౌంటర్లు వేయించుకోక తప్పలేదు కరణ్ కు.

అమీర్ ఖాన్ కరీనాను నా డ్రెస్సింగ్ అండ్ ఫ్యాషన్ సెన్స్ కు ఎన్ని మార్కులిస్తావని సిల్లీగా అడిగాడు. కరీనా సున్నా మార్కులని అమీర్ కు గట్టిగా పంచ్ వేసింది. దీంతో అక్కడ అంతా నవ్వులు పూసాయి. ఏదేమైనా క‌ర‌ణ్‌కు ఈ సారి క‌రీనా, అమీర్‌తో గ‌ట్టి కౌంట‌ర్లు ప‌డ్డాయ‌న్న చ‌ర్చ‌లు సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్నాయి. ఇక సెక్స్ ప్ర‌శ్న‌లు లేనిదే క‌ర‌ణ్ ఇంట‌ర్వ్యూ చేయ‌డు. ఇటీవ‌ల‌ విజయ్ దేవరకొండ ఎపిసోడ్ లో కూడా ఎక్కువ సెక్స్ గురించే అడ‌గ‌గా విజయ్ ఇబ్బంది పడ్డాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)

Share post:

Latest