అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కంగనా రనౌత్.. కనీసం లేవలేనంతగా..?

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే కాదు ఈమెను అందరూ ఫైర్ బ్రాండ్ అంటూ పిలుస్తూ ఉంటారు. ఇక తనకు సంబంధం లేని విషయంలో కూడా తలదూరుస్తూ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది. కేవలం సినిమాకు సంబంధించిన విషయాలను మాత్రమే కాదు సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఎప్పటికప్పుడు ట్రోల్స్ కి గురవుతూ ఉంటుంది. ఇప్పటివరకు తన కెరియర్ లో పెళ్లి , ప్రేమ అనే విషయాలకు ఎప్పుడూ తావు ఇవ్వలేదని చెప్పాలి.. నిజానికి రాజ కుటుంబానికి చెందిన ఈమె సినిమాలలో నటించాలనే కోరికతో కుటుంబాన్ని కాదని ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తోంది. అంతేకాదు ఇప్పుడు కుటుంబం గర్వించదగ్గర నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు కంగనా రనౌత్..Kangana Ranaut recalls having her valuables stolen on solo travels in  Switzerland: 'This is the bad side of Europe' | Entertainment News,The  Indian Expressఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈమె పూర్తిగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారట. ఇక ఎంతలా అంటే బెడ్ మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళితే అసలే వర్షాకాలం ఎక్కడ చూసినా వరదలు.. వాగులు ఉప్పొంగుతున్న నేపథ్యంలో చాలామంది ప్రజలు వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు. ఇక ఈ క్రమంలోని కంగనా కూడా డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతోందట. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఆమె రూముకే పరిమితమై.. షూటింగులకు బందు పెట్టి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుందట.ముఖ్యంగా ఆహారాన్ని సెలైన్ల ద్వారా తీసుకుంటూ ఉండడం గమనార్హం.Kangana Ranaut Talks About The Rumours About Her, Reveals How It Affects  Her Romantic Life

అయితే ఈ స్థితిలో ఆమెను చూసి ఆమె అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
త్వరగా కంగనా కోలుకోవాలని కూడా కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా నడవలేని లేవలేని స్థితిలో ఉన్న ఈమె దేశభక్తిని మాత్రం చాటుకున్నారు. ప్రధాన నరేంద్ర మోడీ ఆగస్టు 15వ తేదీన ప్రసంగాన్ని వింటూ సమయాన్ని గడిపారు. అంతే కాదు చేతిలో జాతీయ జెండా వేసుకొని.. సోషల్ మీడియాలో దర్శనమిచ్చి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వెల్లడించారు.

Share post:

Latest