జబర్దస్త్ వర్షపై కమెడియన్ కృష్ణభగవాన్ జోకులు.. ఏమన్నాడంటే..

కామెడీ షో ‘జబర్దస్త్’ తో ఎంతో మంది నటులు బాగా పాపులర్ అయ్యారు. ఈ షో ద్వారా ఎక్కువగా మగవారే పాపులారిటీ సంపాదించారు.. కానీ ఓ లేడీ కమెడియన్ లు కూడా జబర్దస్త్ షోలో అదరగొట్టారు. అలా జనాదారణ పొందిన లేడీ కమెడియన్లలో వర్ష ఒకరు.. జబర్దస్త్ ఒక్కే కాదు.. బుల్లితెర సీరియల్స్ కూడా వర్ష చేస్తున్నారు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లోనూ ఆమె మెప్పిస్తున్నారు.. అయితే ఆమె ఫేమస్ అయ్యింది మాత్రం జబర్దస్త్ ప్రొగ్రామ్ తోనే.. ఈ షోలో వర్ష ఇమాన్యుల్ లవ్ ట్రాక్ చూస్తే పడి పడి నవ్వాల్సిందే.. అయితే కేవలం టీఆర్పీ కోసమే వీరిద్దరు జంటగా నటిస్తున్నారు..

 

అయితే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో వర్ష మీద కామెంట్లు వస్తుంటాయి. ఆమె ఆడది కాదని, లేడీ గెటప్ అని, మగాడిలా ఉంటుందని ఆమెపై సెటైర్లు వేస్తుంటారు.. వర్ష అలా మారడానికి సర్జరీలు చేయించుకుందని కామెంట్స్ చేస్తుంటారు. అయితే బాడీ షేమింగ్ సెటైర్లకు వర్ష ఎప్పుడూ సీరియస్ కాలేదు.. ఎంతో స్పోర్టివ్ గా తీసుకుంటుంది. అయితే ఇలాంటి కామెంట్లపై ఓసారి ఆమె స్టేజీ మీద భావోద్వేగానికి గురైంది.. ఎప్పుడూ అలా ఎందుకు అనడం అంటూ ఫీల్ అయ్యింది.

తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వచ్చింది.. ఈ ఎపిసోడ్ లో టాలీవుడ్ కమెడియన్ కృష్ణ భగవాన్ గెస్ట్ గా వచ్చారు. ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ ఎపిసోడ్ లో ఆయన కంటెస్టెంట్లపై పంచులు వేశారు. ఈ ఎపిసోడ్ లో ‘నా కొడుకు’ అనే కాన్సెప్ట్ తో కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నతనంలో తప్పిపోయిన కృష్ణ భగవాన్ కూతురు, కొడుకు కోసం పడ్డారు..ఈక్రమంలో ఆది, రాంప్రసాద్ లు కొడుకు నేనంటే ను అని పోటీ పడ్డారు. కృష్ణ భగవాన్ మాత్రం దొంగ నా కొడుకులు అంటూ వారిపై సెటైర్ వేశారు.. వర్ష కూడా ముందుకొచ్చి నాన్న నేనే నీ కూతుర్ని అని అంటుంది.. అవును వీడే నా కొడుకు అని కృష్ణ భగవాన్ అంటారు. దీంతో ఎవరూ కూడా వర్షను అమ్మాయిలా ట్రీట్ చేయడం లేదనిపిస్తోంది..

Share post:

Latest