విజయ్ జీవితం సమంత చేతిలో ఉందా.. అసలు విషయం ఏమిటంటే..?

తాజాగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్.. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుందో మనకు తెలిసిందే. ఇకపోతే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటి ఆట నుంచి సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ప్రతి ఒక్కరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు విజయ్ దేవరకొండ అభిమానులైతే ఈ సినిమా ఫ్లాప్ విషయంలో పూర్తిస్థాయిలో బాధపడుతున్నారని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ కూడా తాను నటించిన సినిమా డిజాస్టర్ కావడంతో లోలోపల బాధపడుతున్నా.. బయటకు మాత్రం సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు..Vijay Deverakonda birthday: Samantha Ruth Prabhu, Ananya Panday post unseen  pics - Hindustan Times

ఇటీవల తనను అనకొండ అంటూ అభివర్ణిస్తూ కామెంట్లు చేసిన హిందీ ఎగ్జిబిటర్ మనోజ్ దేశాయ్ ని కలిసి వివరణ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. అంతేకాదు ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో దుబాయ్ కి వెళ్లి అక్కడ కూడా లైగర్ ను ప్రమోట్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.. ఈ హడావిడి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత తాను నటిస్తున్న మరొక పాన్ ఇండియా సినిమా ఖుషీ సినిమా తదుపరి షెడ్యూల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. ఇందుకు సంబంధించిన రెండు షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా త్వరలోనే మిగతా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చిత్ర బృందం స్పష్టం చేసింది.Kushi: Samantha And Vijay Devarakonda's Next Gets A Titleఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. లైగర్ సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకోవడంతో విజయ్ దేవరకొండ అభిమానులు కూడా తమ దృష్టిని అక్కడి నుంచి ఖుషీ సినిమా మీదకు మరల్చారు. కనీసం ఈ సినిమా అయినా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. నిజానికి సమంతకు ఎలాంటి సినిమా నైనా సరే హిట్ చేస్తుందని గుర్తింపు ఉంది. మజిలీ లాంటి చిన్న సినిమాని కూడా సమంత తనదైన మ్యాజిక్ తో బ్లాక్ బస్టర్ చేసింది. ఇక తన మ్యాజిక్ తో ఖుషి సినిమాను హిట్ చేయాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఇక దీన్ని బట్టి చూస్తే విజయ్ దేవరకొండ కెరియర్ బాగుపడాలి అంటే సమంత ఏదో ఒక మ్యాజిక్ చేయాల్సిందే అంటూ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

Share post:

Latest