ఆ హాట్ హీరోయిన్స్ కెరీర్ వీళ్ల వల్లే నాశనమైందా..!

సినీ పరిశ్రమలో నటించే ఆర్టిస్టుల జీవితం చాలా సున్నితమైనది. ఎన్నో ఆటుపోట్లు వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. హీరోయిన్ల‌ జీవితం కూడా చాలా సున్నితమైనది. హీరోయిన్ల్‌లు పెళ్లి చేసుకోవడం… విడి విడిపోవడం అనేది ప్రస్తుత కాలంలో కామన్ అయిపోయింది. వీరిలో విడాకులు తీసుకున్న కొంతమంది హీరోయిన్లు వారి జీవితంలో బాగున్నవారు ఉన్నారు. అదే క్రమంలో మరికొందరు వ్య‌క్తిగ‌తంగా, ఆర్థికంగా దెబ్బతిన్నవారు కూడా ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం.

సమంత:
తెలుగు సినీ పరిశ్రమకు ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. తన అందం, అభినయంతో తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గాఎదిగింది. అదే క్రమంలో అక్కినేని వారసుడైన నాగచైతన్యతో ప్రేమలో పడి అక్కినేని ఇంటికి కోడలుగా మారింది. దీంతో అమ్మడి రేంజ్ ఒక్కసారిగా ఎదిగిపోయింది. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అదే క్రమంలో సమంతపై అక్కినేని అభిమానులు చాలా కోపంగాా ఉన్నారు. సమంత ఏం మాట్లాడినా ఏం చేసినా వాళ్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.. సమంతపై విమర్శలు కుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈమెకు తెలుగులో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఈ సినిమాలు పూర్తయ్యాక ఈమెకు తెలుగులో మరో అవకాశాలు లేవు.

సారిక:
కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినిమా కెరియర్‌ మొదలుపెట్టి సారిక‌ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే కమలహాసన్ తో ప్రేమలో పడింది. వీరిద్దరూ పెళ్లి కాకుండానే సహజీవనం చేశారు. వీరిద్దరికీ శృతిహాసన్, అక్షర హాసన్ కుమార్తెలు. పిల్లలు పుట్టాక‌ విరి వివాహ బంధంఎన్నో రోజులు కొనసాగలేదు.సారిక తన వివాహ బంధానికి విలువ ఇచ్చి తన సినిమా జీవితాన్ని ఆపేశారు. కమలహాసన్ తో విడాకులైన తర్వాత ఆమె సినిమా జీవితం పూర్తిగా నాశనం అయింది. ఈ రకంగా సారిక సినీ జీవితం అక్కడితో ముగిసింది.

రేణు దేశాయ్ :
రేణు దేశాయ్ ముందుగా మోడల్‌గా తన కెరియర్‌ ప్రారంభించింది. తమిళ్‌లో జేమ్స్ పాండు అనే సినిమా ద్వారా సినిమా పరిశ్రమకు పరిచయమైంది. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా బద్రి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరికీ స్నేహం.. ఆ త‌ర్వాత ప్రేమ‌లో ప‌డి స‌హ‌జీవ‌నం చేశారు. మళ్లీ 2003లో వీరుద్దరూ కలిసి జానీ సినిమాలో నటించారు. 2004 లో వీరిద్దరికి పెళ్లి కాకుండానే కుమారుడు అఖీరా నందన్ జన్మించాడు. 2009లో పెళ్లి చేసుకున్న వీరు త‌ర్వాత రెండేళ్ల‌కే విడిపోయారు. ప‌వ‌న్ కోసం రేణు త‌న కెరీర్ వ‌దులుకుంది. ఆ త‌ర్వాత ఆమె కెరీర్ త‌ల్ల‌కిందులు అయ్యింది. అలా ఈ ముగ్గురు హీరోయిన్లు వివాహం చేసుకోవడం వల్ల‌ వారి సినిమా కెరియర్ మరియు ఫ్యామిలీ లైఫ్ కు దూరమయ్యారు.

Share post:

Latest