టాలీవుడ్‌లో వ‌రుస డిజాస్ట‌ర్లకు ఇంత కార‌ణం ఉందా…!

80వ‌ దశకంలో టాలీవుడ్‌లో యాక్షన్ సినిమాల‌కు మాస్ జనం బాగా కనెక్ట్ అయ్యేవారు. అప్పట్లో ఒకే ఫార్మేట్లో విడుదలైన అలాంటి సినిమాలు ప్రేక్ష‌కుల‌కు బాగా ఎక్కేసేవి. ఒక ఊరిని తన గుప్పెట్లో ఉంచుకొని పవర్ఫుల్ విలన్.. ఆ విలన్ కి ఎదురెళ్లి సవాల్ విసిరే హీరో. ఇదేరకంగా మన టాలీవుడ్ లో చాలా సినిమాలుు వచ్చాయి. ఇదే రొటీన్ ఫార్ములా కొన్ని తరాల నుంచి టాలీవుడ్‌లో హీరోలు ఇవే క‌థ‌ల‌తో సినిమాలు చేసి హిట్లు కొట్టారు.

ఇప్పుడు ప్రేక్షకులు మాత్రం ఇలాంటి అవుట్ డేట్‌ కథలను చూడడానికి ఇష్టపడడంలేదు. దీనికి ఉదాహరణ రీసెంట్‌గా విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. ఎన‌ర్జిటిక్ హీరో రామ్, తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి కాంబోలో వచ్చిన ది వారియర్ ఈ సినిమా కూడా రొడ్డ కొట్టుడు ఫార్ములాతో తీశారు. ఈ సినిమా కథ, కథనాల్లో ఏమాత్రం కొత్తదనం లేక బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా రామ్‌కు మరో ప్లాప్ తప్పలేదు.

ఇక ఇదే ఫార్మాలాతో వచ్చిన మరో సినిమా నితిన్ మాచర్ల నియోజకవర్గం. ఇందులోనూ సేమ్ హీరో కలెక్టర్ పాత్ర పోషించాడు. విల‌న్ భ‌రతం ఎలా ? ప‌ట్టాడు అనేది సినిమా. ఈ సినిమా కూడా రొటీన్ స్టైల్లో 80-90 నాటి క‌థాంశంతో రావడంతో ప్రేక్షకులను ఏం మాత్రం మెప్పించలేకపోయింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక‌ రవితేజ రామారావు ఆన్‌ డ్యూటీ సినిమా కూడా పాత చింత‌కాయ ప‌చ్చ‌డి క‌థ‌తో వ‌చ్చి బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది.

ఇప్పుడున్న ప్రేక్షకుడు సినిమాలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. సినిమాలో కొత్త క‌థ‌నం, క‌థ‌ బలంగా ఉంటే… దానికి స్టార్ హీరో… స్టార్ ప్రొడ్యూసర్, భారీ ప్రమోషన్లు అవసరం లేకుండా సినిమాని హిట్ చేస్తున్నాడు. ఇప్పటికైనా దర్శకులు మారి కొత్త కథలపై దృష్టి పెట్టాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.