‘ఆది’ సినిమా ఆ స్టార్ హీరో అలా మిస్ అయిపోయాడా…!

ఓ హీరోను దృష్టిలో పెట్టుకుని సినిమాకు దర్శకుడు కథ సిద్ధం చేసుకుంటే అది వేరే హీరోతో తీయాల్సి వస్తుంది. తీరా ఆ సినిమా సూపర్ హిట్ అయిే ఆ హీరోలకు ఆ సినిమాను అనవసరంగా వదులుకున్నామనే బాధ వెంటాడుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఇవి చాలా సర్వసాధారణం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా పెట్టి తీయాల్సిన ఇడియట్, పోకిరి, విక్రమార్కుడు వంటి హిట్ సినిమాలలో మిగిలిన హీరోలు నటించారు. ఆ హీరోలకు అవి కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ సినిమాలుగా నిలిచాయి.

ఇక జూ.ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సింహాద్రి సినిమా కథను రాజమౌళి తొలుత ప్రభాస్‌కి వినిపించాడు. అయితే ప్రభాస్ ఆసక్తి చూపించకపోవడంతో జూ.ఎన్టీఆర్ ఆ సినిమా చేయడం, అది తెలుగు సినిమాల్లో ఎన్నో రికార్డులను తిరగరాయడం జరిగిపోయింది. ఇక జూ.ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ హిట్ సినిమా కూడా మరో హీరో చేయాలి. దానికి సంబంధించిన ఆసక్తికర వివరాలిలా ఉన్నాయి.

జూ.ఎన్టీఆర్ హీరోగా, కీర్తి చావ్లా హీరోయిన్‌గా వివి వినాయక్ దర్శకత్వంలో 2002లో విడుదలైన ‘ఆది’ అప్పట్లో పెద్ద హిట్. అయితే వినాయక్ ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు హీరోగా అనుకున్నది మాత్రం జూ.ఎన్టీఆర్ కాదట. కథకు హీరోగా బాలకృష్ణను అనుకున్నట్లు వినాయక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. బాలకృష్ణను దృష్టిలో పెట్టుకునే ఆ కథను రూపొందించానని, కథలో సన్నివేశాలను, డైలాగులను రాసుకున్నానని తెలిపాడు.

ఇక అనివార్య కారణాలతో బాలకృష్ణ ఆ సినిమాను చేయలేకపోయారు. దీంతో జూ.ఎన్టీఆర్ కథ నచ్చడంతో దానిలో మార్పులు చేసి, ‘ఆది’గా తెరకెక్కించారు. దానికి మణిశర్మ అందించిన బాణీలు కూడా తోడవడంతో సినిమా ఓ రేంజిలో ఆడింది. ఏకంగా 98 థియేటర్లలో 100 రోజులు ప్రదర్శించబడింది. ఇలా బాబాయ్ చేయాల్సిన సినిమాను అబ్బాయ్ చేసి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడని తెలుస్తోంది.

Share post:

Latest