ఇక కృతి శెట్టి కెరియర్ ఇరుకున పడ్డట్టేనా..?

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన బేబమ్మ అలియాస్ కృతి శెట్టి ఆ తర్వాత పలు యాడ్ లలో కూడా నటించి మెప్పించింది. ఇక పలు యాడ్స్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న కృతి శెట్టి తెలుగులో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా ద్వారా పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడం గమనార్హం. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రావడం జరిగింది. అలా నానితో శ్యామ్ సింగరాయ్, నాగచైతన్య తో కలిసి బంగార్రాజు వంటి సినిమాలలో నటించి వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.Actress Krithi Shetty Reveals Her Celebrity Crush, It's Sivakarthikeyan

ఇలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి మూడు సినిమాలతోనే హాట్రిక్ విజయాన్ని అందుకోవడంతో అందరూ ఈమెను గోల్డెన్ స్పూన్ తో పుట్టింది అని తెగ పొగిడేశారు. కానీ ఆ తర్వాత కొంచెం తడబాటు పడిందని చెప్పాలి. వరుస ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో సరైన కథల ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకోలేక తన కెరీర్ను ఇరుకున పడేసుకుంటూందని స్పష్టమవుతుంది ఎందుకంటే ఇటీవల రామ్ పోతినేనితో బై లింగ్వల్ మూవీ దివారియర్ సినిమాలో నటించి ఫ్లాప్ ను మూట కట్టుకున్న ఈమె మాచర్ల నియోజకవర్గం సినిమాపై ఆశలు పెట్టుకుంది కానీ ఈ సినిమా కూడా ఈరోజు విడుదల అయ్యి డిజాస్టర్ సొంతం చేసుకోవడం గమనార్హం.మాచర్ల నియోజకవర్గం రివ్యూ: నితిన్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనాఈ రెండు సినిమాల రిజల్ట్ ను చూస్తే ఈమె కేరియర్ ఇరుకున పడ్డట్టే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈమె ఖాతా లో ఒక సూపర్ హిట్ విజయం తప్పకుండా కావాలి అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా తమిళంలో సూర్యతో ఒక సినిమా, విశాల్ తో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . కనీసం అక్కడైనా తన టాలెంట్ నిన్ప్రూవ్ చేసుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆ సినిమాలు కూడా బెడిసి కొడితే ఈమె కెరియర్ ఇక డౌన్ అయినట్లే అంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

Share post:

Latest