ప్రేమ‌క‌థ‌ల్లో హీరోకు ఆ పేరుంటే సూప‌ర్ హిట్టే… ఆ పేరు ఇదే…!

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది అనడంలో సందేహం లేదు.. మెగాస్టార్ చిరంజీవిని మొదలుకొని.. నేటితరం కొత్త హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా తాము నమ్ముకున్న సెంటిమెంట్ ను తమ సినిమాలలో కచ్చితంగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ఇక హీరోలు మాత్రమే కాదు దర్శక నిర్మాతలు కూడా ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే సినిమాలలో ఉండే నటీనటుల పేర్లు పాత్రలకు తగ్గట్టుగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి అని చెప్పడంలో సందేహం లేదు. అందులో ఎక్కువగా హీరోయిన్ కి సీత అనే పేరు బాగా ఆకట్టుకుంటే.. హీరోలకు రామ్ అనే పేరు బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ పేరుతో ఉన్న కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.. మరీ ముఖ్యంగా ప్రేమ కథల్లో హీరోకి ఈ పేరు ఉంటే కచ్చితంగా హిట్ అవుతుందని సెంటిమెంట్ కూడా ఇండస్ట్రీలో బలపడింది. ఇక ఆ సినిమాలేంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. If The Hero Has That Name In The Love Story Movie The Movie Will Be A Super Hit Sitaramam Orange Malli Malli Edi Rani Roju Details, Love Story Movie,sita,ram,sitaramam Movie,orange,96 Movie,, Hero Name Ram, Super Hit Movies, Mallli Malli Edi Rani Roju, Interesting Movie Facts-TeluguStop.comమళ్లీ మళ్లీ ఇది రాని రోజు:
2017లో క్రాంతి మాధవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్ నిత్యామీనన్ నటీనటులుగా నటించారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర పేరు రామ్.

96:
2018 ప్రేమకథా చిత్రంగా విడుదలైన ఈ సినిమాలో విజయ్ సేతుపతి , త్రిష నటీనటులుగా నటించారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర పేరు రామ్.

ఆరెంజ్:
2010లో భాస్కర్ దర్శకత్వంలో మంచి లవ్ స్టోరీ గా విడుదలైన ఈ సినిమాలో రామ్ చరణ్ , జెనీలియా, షాజన్ పదంసీ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. ఇందులో రామ్ చరణ్ పాత్ర పేరు కూడా రామ్.

3:
2012లో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో విడుదలైన సినిమా ఇది.. ఇందులో ధనుష్, శృతిహాసన్ కలిసి నటించారు. ఈ సినిమాలో ధనుష్ పాత్ర పేరు రామ్.

సీతారామం:
ఇక ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్, రష్మిక మందన్న తదితరులు కీలక పాత్ర పోషించిన ఈ సినిమా మంచి ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్ర పేరు రామ్.

Share post:

Latest