కృతిశెట్టి మూడీగా ఉంటే ఆ ప‌ని చేస్తుందా… ఇదేంట్రా బాబోయ్‌..!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్లలో కృతి శెట్టి కూడా ఒకరు. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. తనదైన అందంతో అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి శెట్టి ప్రస్తుతం ఇతర భాషలలో కూడా నటించేందుకు చాలా ఆసక్తి చూపుతోంది. వరుసగా ఉప్పెన, బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్, ఈ వారియర్ అంటే సినిమాలలో నటించి బాగానే మెప్పించింది.Krithi Shetty: Immediate Future Looks Bleak!అయితే ఇప్పుడు హీరో నితిన్ తో కలిసి మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉన్న కొద్దీ చిత్ర బృందం ప్రమోషన్ల పనుల్లో చాలా వేగంగా దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే కృతి శెట్టి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని విషయాలను కూడా పంచుకోవడం జరిగింది. తనకు ఎక్కువగా స్వీట్ తినడం అంటే ఇష్టమని తెలియజేసింది. ఇక అంతే కాకుండా తన మనసుకు ఏదైనా బాగా లేనప్పుడు మాత్రం ఐస్ క్రీమ్ ఎక్కువగా తింటానని తెలియజేస్తుంది. అలా ఐస్ క్రీమ్ తింటే చాలు తన మూడు ఇట్టే మారిపోతుంది అనే సీక్రెట్ ని బయట పెట్టింది.

అయితే ఎవరైనా ఒత్తిడిలో ఉంటే చాక్లెట్లు ఎక్కువగా తింటూ ఉంటారు కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం ఐస్ క్రీమ్ తింటానని తెలియజేసింది. ఇదంతా ఇలా ఉండక కృత్తి శెట్టి ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో సుధీర్ బాబు హీరోగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నది ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇవే కాకుండా నాగచైతన్యతో మరొక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Share post:

Latest