ఢీ14 షోకి అఖిల్‌, హైపర్ ఆది తీసుకునే పారితోషికం తెలిస్తే గుండాగి చస్తారు!

ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ 14 షో ఎంత రసవత్తరంగా కొనసాగుతుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. కాగా ఈ షోలో మళ్లీ బిగ్‌ బాస్‌ అఖిల్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్ లోనే మధ్య లో బ్రేక్ అయ్యి బిగ్ బాస్ నాన్ స్టాప్ కు వెళ్లిన అఖిల్‌ మళ్లీ అనూహ్యంగా ఢీ 14 లో సందడి చేస్తున్నాడు. సాదారణంగా అయితే బిగ్‌ బాస్ లో పాల్గొన్న వారికి ఈటీవీలో ఇంత త్వరగా అవకాశం రాదు.. కానీ అఖిల్‌ కు మాత్రం ఈజీగానే రీ ఎంట్రీ లభించింది. ఆయన తక్కువ పారితోషికం తీసుకుంటున్న కారణంగానే మళ్లీ తీసుకున్నారనే టాక్‌ వినిపిస్తుంది. ఏది ఏమైనా ఈసారైనా అఖిల్ తనదైన మార్క్ కామెడీతో అలరిస్తాడని కోరుకుందాం.

ప్రస్తుతం ఢీ షో లో అఖిల్‌ పాల్గొంటున్నందుకు గాను ఒక్క కాల్షీట్ కి లక్షన్నర రూపాయిలు పారితోషికంగా తీసుకుంటున్నాడని వినికిడి. సాదారణ కంటెస్టెంట్‌ కు కూడా లక్ష వరకు పారితోషికం ఉంటుంది. అలాంటిది అఖిల్‌ కి లక్షన్నర పారితోషికం అంటే చాలా తక్కువ అంటూ అఖిల్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్‌ గతంలో బిగ్‌ బాస్ లో ఉన్న సమయంలో వారంకు రెండున్నర లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే ఈ షోలో అఖిల్ తో పాటు పార్టిసిపేట్ చేసిన హైపర్ ఆదికి మాత్రం ఒక్క కాల్షీట్ కి ఏకంగా అయిదు లక్షల వరకు పారితోషికం ఉంటుందట. జడ్జ్ ల స్థాయిలో ఆదికి పారితోషికం ఉంటుందని బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైపర్ ఆది ఏం చేసినా కూడా స్పెషల్‌ గా ఉంటుంది. కనుక ఆయనకు భారీ పారితోషికం ఇవ్వడం లో ఎలాంటి అనుమానం లేదు. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా హైపర్ ఆదికి మంచి పేరు కూడా దక్కింది.

Share post:

Latest