నా తల్లి కసాయిది అంటున్న హీరోయిన్ సంగీత.. కారణం..?

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సంగీత గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందంతో, అభినయంతో చూడ చక్కని బొమ్మలా కనిపించే ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికీ తెలుగు ఆడియన్స్ విపరీతంగా అభిమానులుగా మారారు. ముఖ్యంగా ఖడ్గం సినిమాలో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ బాగా పాపులారిటీని సంపాదించుకున్న సంగీత.. తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. చూడ్డానికి అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే సంగీత నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఖడ్గం సినిమా తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇక పెళ్ళాం ఊరెళితే, విజయేంద్ర వర్మ, ఈ అబ్బాయి చాలా మంచోడు, శివపుత్రుడు వంటి సినిమాలలో నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది.Sangeetha blames mom for making her work at 13 | Manorama English

ఇకపోతే కొన్ని సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె మళ్లీ ఈ మధ్య సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ కి తల్లి పాత్రలో నటించి ఆకట్టుకుంది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో కూడా స్పెషల్ సాంగులో ఆడి పాడింది. ప్రముఖ సంగీత గాయకుడు కృష్ణ వివాహం చేసుకొని రీఎంట్రీ తర్వాత బుల్లితెరపై అలాగే సినిమాలలో కూడా సందడి చేస్తోంది.. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగీత తన తల్లి కసాయిధి అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.. సంగీత మాట్లాడుతూ నా తల్లి నుంచే నాకు వేధింపులు వచ్చేవి.. నేను నా తల్లి ఒకే ఇంటిలోనే ఉంటున్నాము. ఇక నా భర్త పై ఫ్లాట్లో ఉంటే నా తల్లి తన పెద్ద కుమారుడితో కలిసి కింద అంతస్తులోనే ఉంటుంది..Actress Sangeetha Case: தாய் கொடுமையால் பாதிக்கபட்ட சங்கீதா- வீடியோ - video  Dailymotion

ఇక సొంత కూతురు అని చూడకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని రోజు వేధిస్తోంది అని సంగీత వెల్లడించింది. అంతేకాదు తన తల్లి చేసి పనులను తట్టుకోలేక మహిళా కమిషన్ కి కూడా ఫిర్యాదు చేసిందట సంగీత. 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తనను డబ్బులు సంపాదించే వస్తువుగా తన తల్లి వాడుకుందని చెప్పింది..ఇక తన తమ్ముడు , అన్నయ్య మత్తుకు బానిసయ్యి.. ఇప్పటివరకు ఎలాంటి పనులు చేయలేదు అని, కానీ తన తల్లి మాత్రం వాళ్ళను వెనకేసుకొస్తూ ఉంటుందని, తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేసింది సంగీత.. ఇక తాను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండడం తన తల్లికి ఏమాత్రం ఇష్టం లేదని కూడా ఆరోపించింది. అంతేకాదు తన కాపురాన్ని నాశనం చేయడానికి కూడా పూనుకుంది అని తన తల్లి ఒక కసాయిది అంటూ వెల్లడించింది సంగీత.

Share post:

Latest