క‌ళ్యాణ్‌రామ్ బింబిసార రిజెక్ట్ చేసి బాధ‌ప‌డుతోన్న హీరోలు వీళ్లే…!

తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి హిట్ కొట్టాడు. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పటాస్ సినిమా తర్వాత అంతటి హిట్ అందుకున్న సినిమా ఇదే..! పటాస్ కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించకపోయినా..బింబిసార మాత్రం కలెక్షన్ల పరంగా బాగానే రాబ‌డుతుంది. ఈ సినిమా ఫుల్ రన్ టైం ముగిసేసరికి రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లను సాధిస్తుందంటున్నారు.

ఈ సినిమాను క‌ళ్యాణ్ రామ్ త‌న సొంత నిర్మాణ సంస్థ‌ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు. ఈ సినిమా ద్వారా వ‌శిష్ఠ్‌ అనే కొత్త డైర‌క్ట‌ర్ అని ప‌రిచ‌యం చేశాడు. క‌ళ్యాణ్ రామ్ మొద‌టి నుంచి టాలెంట్ ఉన్న కొత్త డైర‌క్ట‌ర్‌ల‌తోనే ఎక్కువ సినిమాలు చేశాడు. కళ్యాణ్ రామ్ సినిమాతో ప‌రిచ‌యైన డైర‌క్ట‌ర్లు అంద‌రు ఇప్పుడు టాలీవుడ్‌లో అగ్ర ద‌ర్శ‌కులుగా ఉన్నారు. ఇక బింబిసార‌ సినిమా కథను ముందుగా కొంద‌రు హీరోలు రిజెక్ట్ చేసి హిట్ మిస్ అయ్యారు.

ఈ సినిమా డైరెక్టర్ ముందుగా నితిన్ వద్దకు వెళ్ళగా కథ‌ నచ్చకపోవటంతో నితిన్ నో చెప్పారట. తరవాత ఎనర్జిటిక్ హీరో రామ్ కథలో కొన్ని మార్పులు చేయమని చెప్పార‌ట‌ రామ్ మాట డైరెక్టర్ విన‌కపోవడంతో ఆయన కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేశారు, ఇక ఇదే క్రమంలో రాజు తరుణ్, అల్లు శిరీష్‌ వంటి కుర్ర హీరోల వద్దకు కూడా ఈ కథ వెళ్ళింది. వాళ్లంద‌రు రిజెక్ట్ చేయ‌డంతోనే చివ‌ర‌గా ఈ సినిమా క‌ళ్యాణ్‌రామ్ చేతికి చిక్కి మ‌నోడికి బంప‌ర్ హిట్ ప‌డింది.

Share post:

Latest