ఆగస్టు నెలలో రిలీజ్ అయ్యే మూవీల లిస్ట్ ఇదే..అందరి కళ్లు ఆ రెండు సినిమాల పైనే..!! !!

సినిమాలు అంటేనే ఎంటర్ టైన్మెంట్. వినోదం..వీక్ అంత వర్క్స్ తో అలిసి పోయి..మైండ్ మూడ్ ఛేంజ్ అవ్వడానికి సినిమాలు చూస్తుంటాం. అయితే, ఈ నేలలో సెలవులు ఎక్కువే వచ్చాయి. అందుకే కాబోలు బడా సినిమాల నుండి చిన్ని సినిమాల వరకు బాక్స్ పై వద్ద తమ అదృష్టానికి పరిక్షించుకునేందుకు ఈ నెలలో వస్తున్నాయి. చాలా రోజుల తరువాత మళ్ళీ ఇన్ని సినిమాలు ఒక్కే నెలలో రిలీజ్ కు రెడీ అవ్వడం షాకింగ్ గానే ఉంది. ఈ నెలలో ఇండస్ట్రీలో వరుసగా కొత్త చిత్ర చిత్రాలు విడుదల అవుతున్నాయి. అయితే వాటిలో సక్సెస్ రేటు ఉన్న సినిమాల కౌంట్ చాలా తక్కువ.వాతికి సంబంధించిన పూరి వివరాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

బింబిసార: మొదటి వారంలో నే రిలీజ్ అవుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం బాక్స్ ఆఫిస్ లెక్కలు తిరగరాస్తుందని గట్టినమ్మకంతో ఉన్నారు అభిమానులు. వశిష్ఠ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్తా మీనన్‌, కేథరిన్‌ హీరోయిన్స్‌గా నటించారు. టైం ట్రావెల్ కధతో ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్. ఈ మూవీ ఆగస్టు 5న థియేటర్లలో విడుదలవుతోంది.

సీతారామం: ఈ సినిమా కూడా ఆగస్టు 5న రిలీజ్ అవ్వబోతుంది. ఎటువంటి ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోకుండా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తరువాత.. అభిమానుల లెక్కలు మార్చేసింది.
దుల్కర్‌ సల్మాన్‌, మృణాలిని ఠాకూర్‌ జంటగా నటించిన ఈ మూవీ లో రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించనుంది. ఓ యుద్ధంతో పుట్టిన ప్రేమ లాస్ట్ కి మనుషుల జీవితాలని వాళ్ల మైండ్ సెట్ ని మార్చగల్గిందా లేదా అనేదే..అస్సలు పాయింట్. ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ హను రాఘవపూడి డైరెక్షన్.

లాల్ సింగ్ చద్దా: బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ , కరీనా కపూర్ నటించిన ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్ గా ధియేత్రస్ లో రిలీజ్ కానుంది. నాగచైతన్య కీలక పాత్ర పోషించిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది.

కార్తికేయ 2: సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో నిఖిల్ కూడా ఆగస్టు నేలలోనే కార్తికేయ 2 రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది.

మాచర్ల నియోజకవర్గం: ఒక్క పాట సినిమా పై బోలెడు అంచనాలను పెట్టుకునేలా చేసిన హీరో నితిన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మాచర్ల నియోజకవర్గం కూడా ఇదే రోజు విడుదల చేయడానికి మేకర్స్ నిర్ణయించారు. ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

స్వాతిముత్యం: అస్సలు ఈ సినిమా రిలీజ్ అవుతుందని కూడా ఎవ్వరికి తెలియదు. బెల్లకొండ చిన్నబ్బాయి మొదటి సినిమా అయిన స్వాతిముత్యం ఆగస్టు 13న రీలీజ్ కానుంది.

తీస్ మార్ ఖాన్: డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారి అబ్బాయి ఆది చాలా రోజుల తరువాత గ్యాప్ తీసుకుని ..ఆశలు పెట్టుకుని చేసిన ఈ మూవీ ఆగస్టు 19న రిలీజ్ కానుంది.

లైగర్: కోట్లాది మంది విజయ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న సినిమా “లైగర్” ఆగస్టు 25 న రిలీజ్ కానుంది . ఈ సినిమా పై తెలుగు ప్రజలు కన్నా కూడా బాలీవుడ్ జనాలే ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెలలో రీలిజ్ అయ్యే పెద్ద సినిమా లు ..అభిమానులు ఆశలు పెట్టుకున్న సినిమాలు అంటే బింవిసారా..లైగర్ నే. మరి చూడాలి ఈ సినిమాలు ఎలా జనాలను మెప్పిస్తాయో..!?

Share post:

Latest