హీరోయిన్ రమ్యకృష్ణ జీవితాన్ని టర్న్ చేసిన సినిమాలు ఇవే.. ఐరెన్ లెగ్ నుండి గోల్డెన్ లెగ్ వరకు ప్రస్థానం!

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పరిచయం అక్కర్లేదేమో. 1985లో వచ్చిన ‘భలే మిత్రులు’ చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రవేశించి మొదట ఐరెన్ లెగ్ గా పేరు పొందారు. దాంతో సినిమాలు నెమ్మదించాయి. అయితే 1989లో వచ్చిన ‘సూత్రధారులు’ చిత్రం ఆమెకి మంచి నటిగా పేరు సంపాదించి పెట్టింది. అయినప్పటికీ ఈమెకి చాలా కాలం వరకూ సరయిన అవకాశాలు రాలేదు. ఒకానొక దశలో రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పరాజయం పొంది తీరుతుందన్న నమ్మకం కూడా చిత్రసీమలో ఉండేది.

అయితే 1992లో విడుదలయిన ‘అల్లుడుగారు’ చిత్రం మాత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలలో ఈమె వరుసగా నటించగా, దాదాపు అవన్నీ బాక్షఫీస్ వద్ద సూపర్ వసూళ్లు రాబట్టాయి. దాంతో రమ్యకృష్ణ నటిస్తే చాలు ఆ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలకు కలిగేలా చేశాయి. ఆ తరువాత అమ్మడుకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తరువాత ఆమె సినీ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం నరసింహ. ఆ చిత్రం ఆమెకి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చింది. ఆ చిత్రంలో నీలాంబ‌రిగా చ‌రిత్ర‌లో నిలిచిపోయే ప‌ర్ఫార్మెన్స్ చేసింది.

ఇక అమ్మోరు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉంటుంది. అమ్మవారు ఎవరంటే రమ్యకృష్ణనే చెప్పుకొనే స్థాయి నటన కనబరిచింది ఆ సినిమాలో. దాదాపుగా రెండు దశాబ్దాలపాటు ఆమె విజయపరంపర కొనసాగిందని చెప్పుకోవాలి. తరువాత ఆమె కాస్త గ్యాప్ ఇచ్చింది. అయితే కొన్నాళ్ల గ్యాప్ తరువాత… ఆమె బాహుబలి అనే సినిమాలో నటించి యావత్ ఇండియాని షేక్ చేసింది. “బాహుబ‌లి”లో శివ‌గామి పాత్ర‌తో ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో మ‌రోసారి ఆమె త‌న స‌త్తా చూపించింది.