గుడ్ న్యూస్: కార్తీకదీపం లోకి మళ్లీ అడుగు పెట్టబోతున్న వంటలక్క.. వీడియో వైరల్..!

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కూడా ఒకటి. ఇక ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతలా కనెక్ట్ చేసిందంటే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఈ సీరియల్ కి టిఆర్పి రేటింగ్ బాగా పెరిగిపోయిందని చెప్పాలి. ఇక తెలుగు ఆడపడుచులకు అభిమాన సీరియల్ గా మారిపోయిన ఈ సీరియల్ ను ఎక్కువగా వంటలక్క కోసం చూసేవారే చాలామంది ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ సీరియల్ లో దీపను ప్రేక్షకులు ముద్దు గా వంటలక్క అని పిలుచుకునేవారు. ఇక స్టార్ మా లో ఈ సీరియల్ కి ఉన్న రేటింగ్ కూడా అంతా కాదు. ఎన్ని సీరియల్స్ వచ్చినా సరే ఈ సీరియల్ ఢీకొట్టే సీరియల్ రాలేదని చెప్పాలి.Kaarthika Deepam Serial Actor Vantalakka in Balayya Movie !!!

వంటలక్క అంటే తెలుగు ప్రేక్షకులకు మంచి అభిమానం ఇక వంటలక్క అసలు పేరు ప్రేమీ విశ్వనాథ్. కేరళకు చెందిన మలయాళ నటి. కార్తీకదీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఈ సీరియల్స్ తోనే తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. కొన్ని రోజుల క్రితం ఈమె పాత్ర ముగియడంతో అభిమానులు చాలా బాధపడ్డారు. వంటలక్క లేనిదే ఈ సీరియల్ చూడడం వేస్ట్ అంటూ ఎలాగైనా సరే ఆమెను సీరియల్ లో తీసుకురావాలని కూడా కామెంట్లు చేశారు. అనసూయ జబర్దస్త్ ప్రత్యేకంగా ట్వీట్ లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఆమె ఎంట్రీ లేకపోవడంతో సీరియల్ టిఆర్పి రేటింగ్ కూడా అడపాదడపగానే ఉండేది. కానీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుంది అని ఎదురుచూస్తున్న అభిమానులకు సీరియల్ యూనిట్ ఎట్టకేలకు శుభవార్త చెప్పింది అని చెప్పవచ్చు.

ఇక ప్రేమీ విశ్వనాధ్ కు కార్తీకదీపం సీరియల్ లో మళ్లీ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ కార్తీకదీపం సీరియల్ పాత్ర లాగా రెడీ అవుతున్నట్లు కనిపించగా వెంటనే తన అసిస్టెంట్ దీప మేడం షార్ట్ రెడీ అని పిలవగా.. వస్తున్న అంటూ వంటలక్కగా కనిపిస్తుంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు కూడా ఒక రేంజ్ లో సంతోషపడుతున్నారు.

Share post:

Latest