మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ఆస్తి అన్ని కోట్లా..?

మాజీ విశ్వసుందరిగా, స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఐశ్వర్యరాయ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్, హిందీ భాషా చిత్రాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. మొట్టమొదటిసారి 1994లో ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ గా ఎంపిక అయింది. ఇక ఆ తర్వాత ఈమెకి సినిమా అవకాశాలు రావడంతో ఈమె నటించిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక శంకర్ డైరెక్షన్లో వచ్చిన రోబో సినిమాతో సౌత్ ఇండియాలో బాగా పాపులారిటీని సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఒక్కొక్క సినిమాకు సుమారుగా 15 కోట్ల రూపాయలకు పైగా పారితోషకం తీసుకుంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయిAaradhya Bachchan Heaps Praises On Papa, Abhishek's Performance At IIFA,  Calls It 'Very Very Good'

ఇక ఐశ్వర్య ఆస్తుల విషయానికి వస్తే. సుమారుగా రూ. 800 కోట్లకు పైగా ఉంటున్నట్లు సమాచారం. ఇక ముంబైలో ఐశ్వర్యరాయ్ కి సుమారుగా 112 కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన బంగ్లా కూడా ఉంది. ఇక తన భర్త అభిషేక్ బచ్చన్ , కూతురితో కలిసి అక్కడే నివసిస్తున్నట్లు సమాచారం. నిజానికి ఐశ్వర్యరాయ్ కుటుంబానికి కోట్ల రూపాయల విలువ చేసి స్థిరాస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. కేవలం ఐశ్వర్యరాయ్ దగ్గర మాత్రమే రూ.800 కోట్ల ఆస్తి ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు . ఇక ఈమె దగ్గర ఉన్న ఖరీదైన వాచ్ ల విలువ ఏకంగా రూ.21 కోట్లు.Aishwarya Rai sits next to Jaya Bachchan | Bollywood - Hindustan Times

ఐశ్వర్యరాయ్ కు వాచ్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. ప్రపంచంలోనే అత్యంత విలువైన వాచ్లన్నీ ఈమె దగ్గరే ఉంటాయి. ఇక బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూనే.. సంవత్సరానికి 90 కోట్ల రూపాయలను సొంతం చేసుకుంటుంది. అంతేకాదు 45 కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక సౌత్ లో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఐశ్వర్యరాయ్ మళ్లీ హీరోయిన్గా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Share post:

Latest