ఏఎన్ఆర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఎంత పెద్ద స్టార్ హీరోలైనా సరే తమ ఉనికిని చాటుకోవాలి అంటే ఎవరో ఒకరి సహాయంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ తో పాటు ఎస్వి రంగారావు అలాగే నేటితరం హీరోలైన చిరంజీవి, రవితేజ లాంటి ఎంతోమంది హీరోలు ఒకరి సహాయంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక అలా ఇతరుల సహాయంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు దేశం గర్వించదగ్గ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు అంటే వారి ప్రతిభ ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాలకు పాత్రలతో ప్రాణం పోసిన అక్కినేని నాగేశ్వరరావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.Akkineni family remember ANR on birth anniversary

జానపద, కుటుంబ కథ చిత్రాలలో ఎక్కువగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా తన నటనతో ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ కి ఏదైనా డబ్బుకు సంబంధించిన సలహా ఇచ్చాడు అంటే కచ్చితంగా ఎన్టీఆర్ అది పాటించి తీరుతాడు . అంతేకాదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ కు అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో సలహాలు ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఎన్నో గొప్ప పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నాగేశ్వరరావును కూడా ఒకరు ఇండస్ట్రీకి పరిచయం చేశారు.Telugu Dvs Raju, Krishnaveni, Keelu Gurram, Mana Desham, Nandamuritaraka-Movie

నాటి కాలంలో మీర్జాపురం జమీందారైనా డివిఎస్ రాజు గారికి సినిమా అంటే ఎంతో మక్కువ ఉండేది. ఇక ఆయన తొలినాళ్లలో ఎన్నో సినిమాలను నిర్మించేవారు. ఇక ఈ క్రమంలోని జీవనజ్యోతి అనే సినిమాను చేస్తున్న సమయంలో ఆ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కృష్ణవేణి తో రాజుగారికి పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరోజు రాజుగారి భవంతిలో పూలు కోస్తున్న కృష్ణవేణికి ప్రేమ రాయబారం పంపించి పెళ్లికి ఒప్పించారు డివిఎస్ రాజు గారు. ఇక అలా నిర్మాత అయిన రాజుగారు హీరోయిన్ అయిన కృష్ణవేణిని 1950 లో పెళ్లి చేసుకోవడం జరిగింది. అంతే కాదు ఇలా ఇండస్ట్రీలో వారు ఇండస్ట్రీ వాళ్ళని పెళ్లి చేసుకోవడం కూడా మొదలైంది అక్కడి నుంచే..Keelu Gurram Telugu Full Movie | ANR, Anjali Devi - YouTube

ఇక ఆ తర్వాత కాలంలో మీర్జాపురం జమీందారైన రాజుగారు అలాగే ఆయన భార్య ప్రముఖ హీరోయిన్ కృష్ణవేణి ఇద్దరు కలిసి చాలామందిని ఇండస్ట్రీకి తీసుకురావడంతో పాటు ఇద్దరు కలిసి కొన్ని సినిమాలను నిర్మించేవారు.ఇక ఈ క్రమంలోనే మొదటిసారి కీలు గుర్రం సినిమాతో అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీకి పరిచయం చేశారు హీరోయిన్ కృష్ణవేణి అలాగే రాజు గారి దంపతులు. ఇక ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు తన మార్కును చాటుకున్నారని చెప్పవచ్చు.

Share post:

Latest