చైతూ రెండవ తమ్ముడు ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..?

చైతన్య రెండవ తమ్ముడు ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారా..? తండ్రి పరంగా చూసుకుంటే నాగచైతన్యకు ఒక తమ్ముడు, తల్లి పరంగా చూసుకుంటే ఇంకొక తమ్ముడు ఉన్నాడనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక అటు తండ్రి పరంగా.. ఇటు తల్లి పరంగా ఏకంగా ఇద్దరు తమ్ముళ్లకు అన్నయ్య అయ్యారు చైతన్య. ఇకపోతే నాగార్జున.. లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నప్పుడు నాగచైతన్య జన్మించగా ఇక ఆ తర్వాత కొద్ది రోజులకు నాగార్జున లక్ష్మి కి విడాకులు ఇచ్చి రష్యన్ అమ్మాయి అమలను వివాహం చేసుకున్నాడు. ఇక వీరి వివాహం అప్పట్లో పెళ్లి సంచలనంగా మారింది. ఆ తర్వాత ఈ దంపతులకు అఖిల్ అక్కినేని జన్మించిన విషయం అందరికీ తెలిసిందే.Samantha Ruth Prabhu Pens A Heartfelt Note For Ex-Brother In Law Akhil  Akkineni On His Birthday -

ఇక ప్రస్తుతం అఖిల్ అడపాదడపా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ను సొంతం చేసుకునే పనిలో బిజీ అవుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఇప్పుడు ఏజెంట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా..భర్త నుంచి విడిపోయిన తర్వాత లక్ష్మీ కూడా శరత్ రాఘవన్ అనే చెన్నైలో బడా వ్యాపారవేత్త ను వివాహం చేసుకుంది. తల్లి రెండవ వివాహం చేసుకున్న తర్వాత కూడా చిన్నవయసులో నాగచైతన్య తల్లి దగ్గరే ఉండేవాడు. ఆ తర్వాత తండ్రి దగ్గరకు చేరుకున్నాడు. ఇకపోతే లక్ష్మీ రాఘవన్ దంపతులకు కూడా ఒక అబ్బాయి జన్మించాడు. ఇతను కూడా నాగచైతన్యకు తమ్ముడు అవుతాడు.No photo description available.

ప్రస్తుతం ఇతడు ఏం చేస్తున్నాడు? అనే విషయం చాలామందికి తెలియదు. ఇక ఈయన గత కొన్ని రోజుల క్రితమే వివాహం చేసుకొని బిజినెస్ వైపు అడుగులు వేసినట్లు సమాచారం. ఇక చెన్నైలోనే తన తండ్రికి సంబంధించిన వ్యాపారాలను చూసుకుంటూ అక్కడే సెటిల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest