తెలుగులోని ఈ హీరోల హైట్ తెలిస్తే షాక్ అవుతారు… గ్రీకు వీరులా అంటారు!

బేసిగ్గా మన సౌత్ ఇండియన్స్ అంత హైట్ ఉండరని ఓ అపోహ వుంది. అయితే దానిని పటాపంచలు మన హీరోలు. ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఓ అరడజను మంది హీరోలు 6 అడుగులు కంటే పైనే ఉండటం విశేషం. వీరిని తెరపైన చూసినపుడు వారి అభిమానులు వారిని గ్రీకు వీరులుగా కీర్తించడం పరిపాటే. దాంతో పాటు ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఖ్యాతిని గడిస్తున్నారాయె. అలాంటి హీరోల్లో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వారు.

అయితే ఇపుడు ఈ ప్రముఖ హీరోల హైట్ ఎంతో మనము చూద్దాము. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉన్న ప్రభాస్ హైట్ విషయానికొస్తే.. అక్షరాలా 6 ఫీట్ 3 ఇంచెస్. ఇతను నేటి మగువల కలల హీరో అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఇందులో నటించిన రానా కూడా అంతకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు గడించాడు. ఇక ఇతని హైట్ 6ఫీట్ 1 ఇంచెస్. అలాగే ఎంతోమంది కలల రాకుమారుడిగా మారిన హీరో మహేష్ బాబు హైటు కరెక్టు గా 6 ఫీట్స్.

ఆ తరువాతి వరుసలో వున్నవారు గురించి ఇపుడు చూద్దాము…. ఇండస్ట్రీలోకి ముందుగా విలన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత స్టార్ హీరోగా మారిన గోపిచంద్ హైట్ 5 ఫీట్ 11ఇంచెస్. ఇక ఆరు పదుల వయసు దాటిన ఇప్పటి యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న హీరో అక్కినేని నాగార్జున.. హైటు కూడా 5 ఫీట్ 11ఇంచెస్ కావడం యాదృశ్చికం. ఇక నేటి తెలుగు ఇండస్ట్రీ లో రౌడీ హీరో గా పేరు పొందిన విజయ్ దేవరకొండ హైట్ 6 ఫీట్. మల్టీ టాలెంటెడ్ హీరో వెంకటేష్ హైట్ కూడా 6 ఫీట్. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్ హైట్ మాత్రం 6 ఫీట్ 3 ఇంచెస్. అదండీ మన హీరోల పొడుగు వ్యవహారం.

Share post:

Latest