ఈ స్టెప్ ఏం చూసి పెట్టారో తెలుసా..? ప్రభాస్ పడి పడి నవ్వుకున్నాడు..!!

ఈ మధ్యకాలంలో సినిమాలో వచ్చే పాటలకు స్టెప్స్ ఎలా ఉంటున్నాయో మనకు తెలిసిందే. కానీ ఒకప్పుడు సినిమాలో వచ్చే పాటలకు స్టెప్స్ అద్దిరిపోయేవి. ఇప్పుడు వచ్చేవి కొంచెం రొటీన్ గా మరి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. గతంలో పాటలకు డాన్స్ వేస్తే చాలా చక్కగా చూసేవారు. ఇప్పుడు థియేటర్స్ లో పాటలకు డాన్స్ వేస్తే ఒకటి రెండు మినహాయిస్తే మిగతా పాటలన్నీ సుత్తి కొట్టిస్తున్నాయి. కాగా ఇలాంటి క్రమంలోని ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమాలోని బ్లాక్ బస్టర్ పాట బొమ్మాలి స్టెప్ ఎంత హైలెట్ గా మారడానికి రీజన్ బయటకి వచ్చింది.

 

ఈ సినిమాలో ఆ పాట బీభత్సమైన క్రేజ్ సంపాదించుకుంది. పైగా క్రేజియస్ట్ జంట ఈ పాటకి స్టెప్ లు వేయడంతో ఆ పాటకి ఇంకా అందం వచ్చింది. అయితే ఈ పాటలో స్టెప్ మూమెంట్లో ప్రభాస్ అనుష్క ఇద్దరు నిల్చోని ఉండగా ప్రభాస్ అనుష్క ప్యాంట్ పైకి లేపుతూ బ్యాక్ పై కొడుతూ ఉంటారు. నిజానికి ఈ పాటకి స్టెప్ ఇలా అనుకునింది కాదట. కొరియోగ్రాఫర్ ఈ స్టెప్ ను వేరేలా డిజైన్ చేశారట. ఓ విధంగా చెప్పాలంటే ఈ స్టెప్ ను డైరెక్టర్ మెహర్ రమేష్ పరోక్షంగా కొరియోగ్రఫీ చేశారని చెప్పాలి.

ఈ సినిమా షూటింగ్ టైం లో మెహర్ రమేష్, ప్రభాస్ చాలా సరదాగా ఉండేవారట . అప్పుడు ప్రభాస్ అనుష్క సరదాగా నవ్వుకుంటూ ఈ పాట స్టెప్స్ కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు..” ఇంకెంత సేపు సామి” అంటూ ప్రభాస్ డైరెక్టర్ ని ఆటపట్టించేవాడట. ఈ పాట కొరియోగ్రఫీ లాస్ట్ లో షూట్ చేసిన్నట్లు చెప్పుకొచ్చారు. ఆ టైంలో సినిమా ఎలా అయినా హిట్ అవ్వాలని భారీ బడ్జెట్ పెడుతున్నామని సీరియస్ డిస్కషన్ మధ్యలోకి రాగా ఆ టైంలో మెహర్ రమేష్ ఒళ్లంతా చెమటలు పట్టేసి సీట్లో నుంచి పైకి లేచి ప్యాంట్ లాక్కుని మళ్ళీ కూర్చొని డైరెక్షన్ స్టార్ట్ చేశారట.

అదే మూమెంట్ ని కాపీ కొట్టిన కొరియోగ్రాఫర్ .. వెంటనే ప్రభాస్ అనుష్క పై అప్లై చేసి.. స్టెప్ కొరియోగ్రఫీ చేసారట . దీంతో అప్పుడు ప్రభాస్ పడి పడి నవ్వకున్నారట. ” మెహర్ రమేష్ నీ ప్యాంటు లూజ్ మాకు కొత్త స్టెప్ ఇచ్చింది” అంటూ ప్రభాస్ ఫన్నీగా చెప్పుకొచ్చారట. దీనికి ముందు ఈ స్టెప్ కోసం ఎన్నో రకాల మూమెంట్స్ ను ట్రై చేసిన కుదరలేదు. ఒక్క రమేష్ ప్యాంటు స్టెప్పుతో ఓకే అయింది. అంటూ ఇప్పటికీ స్టెప్ గురించి నవ్వుకుంటూ ఉంటారట. ఆ తర్వాత ఈ సినిమా ఫ్లాప్ టాక్ సంపాదించుకున్నప్పటికీ.. సినిమాలో పాటలు ప్రభాస్ లుక్స్, ప్రభాస్ అనుష్క రొమాన్స్ మంచి క్రేజ్ తీసుకొచ్చాయి.